Actor M Illavarasan attempts suicide

Vishal s life saving help for an actor

Illavarasan, arasu, suicide attempt, Sasikala, suicide letter, Devi trust, actor Vishal, nadighar sangam, Illavarasan financial problems, kollywood producers, artists payments, remunerations. Actor M Illavarasan attempts suicide

Knowing the sad state of affairs of Ilavarasan, Vishal who has been helping various people according to their needs has immediately sent his fan club member to the hospital to hand over the financial aid of Rs.10,000/- through his Devi Trust.

కోలుకుంటున్న నటుడు.. ఆర్థికసాయం అందించిన అగ్రహీరో

Posted: 08/26/2016 10:10 PM IST
Vishal s life saving help for an actor

తన భార్య విడాకులు ఇచ్చేందుకు నోటీసు పంపించదన్న మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ సహాయ నటుడు అరసు అలియాస్ ఇలవరసన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఇలవరసన్ అరోగ్యం నిలకడగానే వుందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయన రాసిన సూసైడ్ నోట్ మీడియా ద్వారా తెలసుకున్న నడియార్ సంఘం అధ్యక్షుడు విశాల్ తన ఫ్యాన్ క్లబ్ మెంబర్ ను పంపి తక్షణ సాయం కింది పదివేల రూపాయలను అందించారు. కాగా ఇలవరసన్ కోలుకున్న తరువాత ఆయనకు రావాల్సిన డబ్బుల విషయమై నిర్మాతలతో మాట్లాడుదామని కూడా సమాచారం పంపినట్లు తెలుస్తుంది,

సినీమాల్లో మాదిరిగా నిజ జీవితంలోనూ ప్రేమ వివాహాలు సక్సెస్ ను అందుకుంటాయని భావించిన అరసు అలియాస్ ఇలవరసన్ తాను ప్రేమించిన అమ్మాయితో కులాంతర వివాహం చేసుకున్నాడు. 2012వ సంవత్సరం మార్చి 9వ తేదీన వివాహం కూడా చేసుకున్నాడు. వీరికి శివ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వివాహం కాగానే అర్ధిక ఇబ్బందుల కారణంగా భార్య ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆ తరువాత మనస్సర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు.

ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అరసు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికి చేరుకుని విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఇలవరసన్‌ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కొడుంగయూర్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అతని ఇంట్లో లభించిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సినీ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు దీనంగా తన బాధను వ్యక్తం చేస్తూ రాసినట్టు తెలిసింది.

అందులో తాను ఏడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని తనకు సినిమా రంగంలో తగిన జీతం అందలేదని, దీని వలన కుటుంబంలో తనకు తన భార్యకు మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని తాను విరక్తి చెంది ఉన్న సమయంలో తనకు తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు అందిందని, దీని వలన తన కుమారుడికి ఇబ్బందులు గురవుతున్నాడని.. కష్టాల కడలిలో తనకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కోలీవుడ్ లో ఇవరసన్.. ఓనాయుం, ఆటుకుట్టిం, డమాల్ డుమీల్, శకుని తదితర సినిమాల్లో సహాయ నటుడిగా నటించి గుర్తింపును తెచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Illavarasan  arasu  suicide attempt  Sasikala  suicide letter  Devi trust  actor Vishal  

Other Articles