Honour Killing: Watch woman recorded video before being murdered

Woman records video fearing honour killing dies two days later

honour killing, honour killing in uttar pradesh, uttar pradesh news, crime in uttar pradesh, crime news from uttar pradesh, Hathras murder, UP Police, Woman murdered, crime news

Authorities have registered a case against the woman’s family members, who are absconding, after the video surfaced online amid allegations that she is a victim of honour killing.

నెట్ లో కలకలం రేపుతున్న మృతురాలి వీడియో

Posted: 08/26/2016 07:59 PM IST
Woman records video fearing honour killing dies two days later

ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన 26 ఏళ్ల యువతిది పరువు హత్యా..? అమెను తన కుటుంబసభ్యులే హత్య చేశారా..? అంటే అవుననే వాదనలే తెరపైకి వస్తున్నాయి. ఆ యువతి చనిపోవడానికి ముందు రికార్డు చేసిన వీడియో బయటపడడంతో కలకలం రేగింది. హాత్రాస్ జిల్లాలో యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా అమె మరణించిందని అంతా భావిస్తున్న సమయంలో ఈ వీడియో బయటపడటంతో అమెది అనుమానాస్పద మృతి కాదని, పరువు హత్యేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.

వేరే వ్యక్తిని తాను ప్రేమించిన యువతిని బలవంతంగా తమ స్వగ్రామానికి తీసుకెళ్లి.. అక్కడ అమెను తన కుటుంబసభ్యలే హత్య చేశారన్న అనుమానాలకు బలం చేకూరుతుంది. చనిపోవడానికి ముందు రైలు వాష్రూమ్ లో సెల్ఫోన్ లో ఆమె రికార్డు చేసిన వీడియో ఇంటర్నేట్ లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో 'నేను మేజర్ని. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ మా నాన్న, సోదరుడు, బంధువులు ఒప్పుకోవడం లేదు. నన్ను చంపేందుకు బలవంతంగా మా ఊరికి తీసుకెళుతున్నారు. నాకేదైనా జరిగినా.. నేను చనిపోయినా మా నాన్న, సోదరుడు, బంధువులదే బాధ్యత'ని వీడియోలో ఆమె పేర్కొంది.

ఈ వీడియో ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసినట్టు హాత్రాస్ ఎస్పీ అజయపాల్ శర్మ తెలిపారు.  వేరే వ్యక్తిని అమె ప్రేమించడంతో అమెను వారి కుటుంబసభ్యులే హత్య చేసి వుంటారన్న అనుమానంతో కేసును పరువు హత్యగా మార్చామని తెలిపారు, ఈ వీడియో నెట్ లో ప్రత్యక్షం కావడంతో మృతురాలి కుటుంభసభ్యులను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లగా, వారు పరారీలో వున్నట్లు సమాచారం, దీంతో నిందితుల కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honour killing  Hathras murder  UP Police  Woman murdered  crime  

Other Articles