తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాల్సిందే | MP kavitha demand special package to telangana also

Mp kavitha demand special package to telangana also

MP kavitha on AP special Package, telangana MP on AP Package, Kavitha on AP package, Kavitha demand central, Central on Telangana package, Kalvakuntla Kavitha about AP package

MP kavitha demand special package to telangana also.

ఒక్క ప్రత్యేక హోదా తక్క...

Posted: 08/19/2016 08:52 AM IST
Mp kavitha demand special package to telangana also

ఆర్థిక లోటులో ఉన్న నవ్యాంధ్ర హోదా కిరీటం ఇవ్వలేని కేంద్రం ఆర్థిక సాయం పేరుతో సరిపెట్టాలన్న ప్రయత్నం కొద్దిమేర విజయవంతం అవుతుందనే చెప్పాలి. హోదాకు మించి 30 శాతం అదికంగా నిధులు విడుదల చేయటంతోపాటు, రాయితీలు ఎక్సెట్రా..ఎక్సెట్రా... సదుపాయాలను కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది కూడా. ఈ మేరకు గురువారం ఏపీకి రూ.1,976 కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మూడు పద్దుల కింద అందజేస్తున్న ఈ సాయానికి సంబంధించి కేంద్రం విస్పష్ట ప్రకటన చేసింది. అయితే సాటి తెలుగు రాష్ట్రంతో అన్నింట్లో పోటీ పడే తెలంగాణ ఊరుకుంటుందా? తమకు కూడా నిధులు కావాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రకటన ఇలా వెలువడిందో లేదో టీఆర్ఎస్ నేతలు క్యూ కట్టేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించాల్సిందేనని ఆమె పట్టుబడుతున్నారు.

ఏపీకి కేంద్ర సాయానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్న ఆమె అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా అభ్యంతరం ఏమీ లేదంటున్నారు. అయితే అదే సమయంలో ఏపీకి అందించే ప్రతి ప్రయోజనాన్ని కేంద్రం తెలంగాణకూ అందించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ పరంగా ముందంజలో ఉన్నప్పటికీ అప్పుల విషయంలో ఈ రెండేళ్లలో తెలంగాణ ఏపీని మించి పోయిందన్న విషయం ఈమధ్య కేంద్రం లెక్కలో తేలింది. ఈ నేపథ్యంలో ఆ మాత్రం ఆర్థిక సాయం అడగటం ఊహించిందేలేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nizamabad MP  Kalvakuntla Kavitha  AP package  Telangana  

Other Articles