BJP MLA Avsare slaps a police man in Bhandara, video shows

Caught on camera bjp mla slaps policeman in mumbai

BJP legislator, Maharashtra, Ramchandra Avsare, local police station, Bhandara city, Constable Raju Sathvane, Tiranga Yatra

A BJP legislator in Maharashtra, Ramchandra Avsare, has been caught on camera slapping a police constable at the local police station in Bhandara city.

ITEMVIDEOS: పోలీసులపై బీజేపి ఎమ్మెల్యేకు కోపం వచ్చింది..

Posted: 08/18/2016 10:32 PM IST
Caught on camera bjp mla slaps policeman in mumbai

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజాప్రతినిదులు రెచ్చిపోతున్నారు. డిప్యూటీ కలెక్టర్పై చేయిచేసుకున్న ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ ఘటనను మహారాష్ట్రవాసులు మరువకముందే మరో బీజేపి ప్రతినిధి ఏకంగా పోలిస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించారు. తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై తమ కార్యకర్తలు పిర్యాదు చేయడంతో పోలిస్ స్టేషన్ కు వచ్చిన ఆయన ఠాణాలో ఉన్నతాధికారుల సమక్షంలోనే అయన కానిస్టేబుల్ పై రెచ్చిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే తిరంగా యాత్రంలో భాగంగా భంద్రా పట్టణంలో నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్ర అక్కడి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో మిస్టర్ సత్వానే అనే కానిస్టేబుల్ ఓ కారు డ్రైవర్ తో త్వరగా వెళ్లమని కోరాడు, ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కు కారు డ్రైవర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యేకు విషయాన్ని చెప్పారు బీజేపి కార్యకర్తలు. దీంతో కానిస్టేబుల్ సత్వానేతో మాట్లాడేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర అవసరే బాంద్రా పోలీస్‌స్టేషన్ అవరణలోనే అతని చెంపమీద కొట్టారు. పోలీసులను తిట్టిపోశారు. పోలీసులు అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే దాడికి దిగారు. ఇది కాస్తా మీడియాకు చిక్కడంతో అది వైరల్ గా మారింది, దీంతో ప్రజాప్రతినిధులు అంతేనంటూ నెట్ జనులు విమర్శలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles