Pakistan to 'forcefully' raise Kashmir issue in UN, feels Modi crossed 'red line' by talking about Balochistan

Modi crossed red line by talking about balochistan says pakistan

jammu kashmir issue, Narendra Modi, Balochistan, UN General Assembly (UNGA), Nafees Zakaria, nawaz sharif, Pakistan, Kashmir, Independence Day Speech, Pak Occupied Kashmir, human rights violation

Pakistan said PM Modi crossed the "red line" by talking about Balochistan and asserted that it will "forcefully" raise the Kashmir issue at the UN General Assembly session next month.

మోడీ ధాటికి ధాయాదికి దిమ్మతిరిగి బొమ్మ కనబడింది..

Posted: 08/18/2016 08:48 PM IST
Modi crossed red line by talking about balochistan says pakistan

పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని తననెవ్వరూ చూడటం లేదని భ్రమిస్తుందన్న నానుడి పాకిస్తాన్ కు అక్షరాల సరిపోతుంది, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏకంగా దేశ సరిహద్దులు దాటి భారత్ లోకి చోచ్చుకువచ్చి అలజడులు సృష్టిస్తున్నా.. బాంబుదాడులకు పాల్పడి అమాయక దేశ ప్రజల ప్రాణాలను హరిస్తున్నా.. దాని విషయమై ఐక్యరాజ్య సమితిలో నోరు మెదపని పాకిస్థాన్ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కారించుకుని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగాన్ని మాత్రం ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తుతామని ఆయన రెడ్ లైన్ దాటారని తమ తప్పులను కప్పిపచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది.

తన మిత్రదేశమైన చైనాతో కలసి భారత నియంత్రణ రేఖకు అత్యంత సమీపం నుంచి రోడ్లు వేసిన పాకిస్థాన్ ఆ అంశాన్ని మర్చి.. మన ప్రధాని చేసిన ప్రసంగం ద్వారా గీత దాటారని కొత్త ప్రచారానికి తెరలేపుతుంది, జమ్ము కశ్మీర్‌లో భారత్ సాగిస్తున్న 'రాజ్య ఉగ్రవాదం' అంశాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో 'ఎలాగైనా' తాము ప్రస్తావిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చాలా బలంగా ప్రస్తావిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు.

పాకిస్థాన్ ఎప్పుడూ జమ్ము కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ప్రస్తావిస్తూనే ఉందని, గత సంవత్సరం కూడా నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ఈ అంశం గురించి గట్టిగా మాట్లాడారని ఆయన అన్నారు. కశ్మీర్ లోయలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యదేశాలలో చాలా వరకు గుర్తించాయని చెప్పారు. అయినా సరే ఈ విషయాన్ని మళ్లీ ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే కేవలం ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు.. పాకిస్థాన్ దమననీతికి దర్పణం పడుతున్నాయి కాబట్టే.

పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌లో చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామన్న మోదీ ప్రకటనలపై పాక్ నాయకత్వం విస్మయానికి గురైంది, దీంతో ప్రధానిపై మండిపడుతూనే.. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్‌పై మాట్లాడి నరేంద్రమోదీ 'రెడ్‌లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా అన్నారు. మరి భారత్ లోని కాశ్మీర్ అంశం గురించి పాకిస్తాన్ నేతలు ఎలా మాట్లాడుతున్నారో వారి ద్వందనీతికే తెలియాలి, బలూచిస్తాన్‌ గురించి మాట్లాడటం ద్వారా ఐక్యరాజ్యసమితి(యూఎన్) నియమావళిని మోదీ ఉల్లంఘించారని అంటున్న పాక్ తమ నేతలు ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలన్నీ కూడా కాశ్మీర్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది మర్చారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles