బ్రిటీష్ బంకర్ ను స్వయంగా కనిపెట్టిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ / Ch Vidyasagar Rao finds underground bunker from British era inside Maharashtra Raj Bhavan

Ch vidyasagar rao finds underground bunker from british era

Maharashtra Governor Ch Vidyasagar Rao finds underground bunker, British Bunker in Maharashtra Raj Bhavan, Vidyasagar Rao discover

Maharashtra Governor Ch Vidyasagar Rao finds underground bunker from British era inside Raj Bhavan. Maharashtra Governor Ch Vidyasagar Rao has discovered a 150-metre long underground British era bunker inside the Raj Bhavan complex at Malabar Hill.

బ్రిటీష్ రహస్య స్థావరాన్ని కనిపెట్టిన మన గవర్నర్

Posted: 08/17/2016 12:58 PM IST
Ch vidyasagar rao finds underground bunker from british era

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)

మహారాష్ట్ర రాజ్ భవన్ లో బ్రిటిష్ కాలం నాటి అద్భుతమైన బంకర్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది. పక్కా సమాచారంతో ఈ రహస్య స్థావరాన్ని అందుకున్న గవర్నర్ విద్యాసాగర్, స్వయంగా కనుగొనటం ఆసక్తికరంగా మారింది.

రాజ్‌భవన్‌ లోపల బంకర్ ఉన్నట్టు మూడు నెలల క్రితం పాతతరం సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఈ తెలుగు గవర్నర్ దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పబ్లిక్స్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈనెల 12 నుంచి తవ్వకాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజ్‌భవన్‌లోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడను తొలగించగానే, ఈ బంకర్ బయటపడింది.  

150 మీటర్ల పొడవులో నిర్మించిన దీనిలో సకల సదుపాయాలు ఉన్నాయి. మొత్తం 5వేల చదరపు అడుగులలో నిర్మించిన ఈ బంకర్‌లో 13 గదులు ఉన్నాయి. బాంబ్‌షెల్ స్టోర్, గన్‌షెల్, కాట్రిడ్జ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్‌షాప్‌ల కోసం ప్రత్యేకంగా గదులను కేటాయించారు. తాజా గాలి, వెలుతురు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైనేజీ సిస్టం కూడా ఉండడం గమనార్హం.

విషయం తెలియగానే మంగళవారం భార్య వినోదతో కలిసి గవర్నర్ బంకర్‌ను సందర్శించారు. ఆయనే ముందుండి మిగతా వారిని తీసుకెళ్లటం విశేషం. చరిత్రకారుల కథనం ప్రకారం ప్రస్తుతం రాజ్‌భవన్‌గా ఉంటున్న ఈ భవనం 1885లో అప్పటి లార్డ్ రీయ్ శాశ్వత నివాసం. అంతకుమందు దీనిని బ్రిటిష్ గవర్నర్లు వేసవి విడిదిగా ఉపయోగించుకునేవారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Governor Ch Vidyasagar Rao  Discover  British Bunker  

Other Articles