'Nayeem Threatened Me': MLC Komatireddy Rajgopal Reddy

Nayeem threatened me for several times

gangster nayeem, komatireddy rajagopal reddy, congress mlc, poliicians, sheshanna, police officials, former police officers, Land grabbings, victims complaints, LB nagar, nayeem bedroom, nayeemuddin, sit, special investigation team, Telangana

The Congress MLC Komatireddy Rajagopal Reddy stated that he was threatened by Nayeem’s gang in the past and alleged that most of the TRS leaders are linked to TRS.

గ్యాంగ్ స్టర్ నయీంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Posted: 08/17/2016 08:05 AM IST
Nayeem threatened me for several times

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం తనను ఎన్నికల నుంచి తప్పుకోమని బెదిరించాడని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ, తాను గతంలో ఎమ్మెల్సీగా పోటీలో నిలబడినప్పుడు పోటీలోంచి తప్పుకొమ్మని నయీం ఒత్తిడి చేశాడన్నారు. ఈ సందర్భంగా నయీం మనుషులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. నయీం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

నయీమ్ అరాచకాలు 2009 నుంచి పెరిగిపోయాయని ఆయన అన్నారు. నయీమ్ తో చాలా మంది రాజకీయ నాయకులకు లింకులున్నాయని వార్తా కథనాలు వెలువడుతున్నాయని అన్నారు. సంఘవిద్రోహ శక్తులుగా మారిన వ్యక్తులతో స్నేహం చేసిన రాజకీయ నాయకుల గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు. తక్షణం వారి పేర్లు వెల్లడించి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నయీమ్ ను ఎన్ కౌంటర్ చేసి ప్రభుత్వం మంచి పని చేసిందని ఆయన చెప్పారు.

గతంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు నయీమ్ తో ఏం లొసుగులు ఉండి అతనిని ఉపేక్షించారో తనకు తెలియదని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. నయీమ్ కారణంగా నిరుపేదలు నష్టపోయారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నేతలను రక్షించే ప్రయత్నంలో కేసును నీరుగార్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసును సీబీఐకి అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు.

ఇక నయీమ్ ముఖ్య అనుచరుడు శేషన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు, శేషన్న కనుసన్నల్లోనే నయీమ్ నయామ్ అక్రమాలు సాగాయని పోలీసులు భావిస్తున్నారు. అతను చిక్కితే నయీమ్ అక్రమాలు మారిన్న వెలుగుచూస్తాయని అవకాశముందని కూడా పోలీసులు బావిస్తున్నారు. కాగా, నయీం అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. నయీం ఎన్ కౌంటర్ కావించబడ్డప్పటికీ, ఆ పాపాలుడు సంపాదించిన ఆస్తులు కాపాడుకునేందుకు వాడి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పలువురు వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. వారిని కూడా అదుపులోకి తీసుకుంటే మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles