డిప్యూటీ కలెక్టర్ పై చేయి చేసుకన్న ఎమ్మెల్యే | NCP MLA slaps Deputy Collector in Maharashtra

Ncp mla slaps deputy collector in maharashtra

NCP MLA Karjat Suresh Lad, NCP MLA slaps Deputy Collector, Deputy Collector in Maharashtra, Karjat Suresh Lad slaps IAS, IAS slapped by MLA, Abhay Kalgudkar slapped

NCP MLA Karjat Suresh Lad slaps Deputy Collector in Maharashtra.

ITEMVIDEOS:ఐఏఎస్ కాలర్ పట్టుకుని, చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే

Posted: 08/17/2016 09:30 AM IST
Ncp mla slaps deputy collector in maharashtra

నిజాయితీగా పని చేసే అధికారులకు విధి నిర్వహణలో లభించేంది ట్రాన్స్ ఫర్ లు, సస్పెండ్ లే కాదు, అదనంగా దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగబద్ధంగా చట్టసభలకు ఎంపికైన నేతలు వారిపై దౌర్జన్యాలకు ఎగబడిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ లో ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఎమ్మెల్యే ఏకంగా ఐఏఎస్ స్టాయి అధికారిపైనే చెయ్యి చేసుకున్నాడు.

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన నేత, కర్జాత్ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ రాయ్ ఘడ్ లోని డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో వీరంగమాడారు. నేరుగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన లాడ్... అక్కడ విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. అదే ఊపులో అక్కడి ఓ అధికారి చెంప చెళ్లుమనిపించిన లాడ్... డిప్యూటీ కలెక్టర్ కాలర్ పట్టుకుని అతనిపైనా చేయి చేసుకున్నాడు.

‘ప్లీజ్ ఆపండి.. ప్లీజ్ ఆపండి’ అంటూ సదరు డిప్యూటీ కలెక్టర్ వేడుకున్నా... లాడ్ మాత్రం తన ప్రతాపాన్ని ఆపలేదు. కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCP  MLA Karjat Suresh Lad  slap  Deputy Collector  Abhay Kalgudkar  

Other Articles