మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య | SI Commits Suicide Using his Service Revolver in Medak District

Si commits suicide using his service revolver in medak district

SI Rama Krishna Reddy Commits Suicide, Telangana SI suicide, SI suicide with service revolver, SI rama krishna suicide, SI suicide letter, Officials pressure Rama Krishna suicide

SI Rama Krishna Reddy Commits Suicide Using his Service Revolver in Medak District

ITEMVIDEOS:మెదక్ ఎస్సై సూసైడ్ లేఖలో ఏముంది?

Posted: 08/17/2016 08:45 AM IST
Si commits suicide using his service revolver in medak district

ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగాను తాను ఆత్మహత్య చేసుకున్నట్లు మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఓ సూసైడ్ లేఖ రాశారు. ఈ లేఖ పోలీసు శాఖలో పెను కలకలమే రేపుతోంది. ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు ఆయన తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు తెలుస్తోంది.

ఉన్నతాధికారులు వేధిస్తున్న గోడును తన కింద పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు ఫోన్ చేసి మరీ వెళ్లబోసుకున్నారు. బాసుల వేధింపులకు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన వారితో చెప్పారట. రామకృష్ణారెడ్డిని వారించే యత్నం చేస్తూనే సదరు కానిస్టేబుళ్లు... అక్కడికి సమీపంలోని గజ్వేల్ ఎస్సైగా ఉన్న కమలాకర్ కు సమాచారం చేరవేశారు.

 

ఈ క్రమంలో వేగంగా స్పందించిన కమలాకర్ నేరుగా రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారట. వేధింపులపై మాట్లాడదామని, తానిప్పుడే బయలుదేరి వస్తున్నానని, తాను వచ్చే దాకా ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోరాదని కమలాకర్ ఆయనను కోరారు.

సహచర ఉద్యోగి చెప్పిన మాటలు కూడా రామకృష్ణారెడ్డికి సాంత్వన చేకూర్చలేకపోయాయి. ఫోన్ పెట్టేసి కారెక్కిన కమలాకర్ కుకునూరుపల్లికి చేరుకునేలోగానే రామకృష్ణారెడ్డి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసేసుకున్నాడు. తనతో కొద్దిసేపటి క్రితం ఫోన్ లో మాట్లాడిన తన సహచర ఉద్యోగి విగతజీవిగా పడి ఉండటం కమలాకర్ ను కలచివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medak  SI  Rama Krishna  Suicide  

Other Articles