123 జీవో కొట్టివేత పై స్పష్టత ఇస్తారంట | High Court Cancels GO No 123

High court cancels go no 123 on mallanna sagar land acquisition

High Court Cancels GO No 123, Telangana govt 123 GO, GO 123 and 124 GOs, Mallanna Sagar GO, Mallanna Sagar Land Acquisition

High Court Cancels GO No 123 Telangana govt think for appeal.

123 జీవో.. సినిమా ఇంకా అయిపోలేదు

Posted: 08/03/2016 05:57 PM IST
High court cancels go no 123 on mallanna sagar land acquisition

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టం కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123ని హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో ద్వారా అందే పరిహారం గురించి న్యాయస్థానంలో మరింత సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం కాకుండా 123 జీవో ప్ర‌కారం ప్రభుత్వం నేరుగా భూముల‌ను సేక‌రిస్తోందంటూ, దీని వల్ల త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ మెద‌క్ జిల్లా భూనిర్వాసితులు హైకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. పిటిష‌న‌ర్లతో ఏకీభ‌వించిన హైకోర్టు 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కార‌మే రైతుల నుంచి భూసేకరణ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. 123 జీవోతో పాటు 124 జీవోను కూడా కొట్టి వేసింది. 2013 చ‌ట్టాన్ని ఉప‌యోగించ‌కుండానే ప్రాజెక్టులు మొద‌లు పెడ‌దామ‌నుకున్న తెలంగాణ స‌ర్కార్‌కి హైకోర్టు తీర్పు పెద్ద దెబ్బే తగిలినట్లయ్యింది.

రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం 123 జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలో కేవలం రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. వాస్తవానికి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్ట్‌ల భూసేకరణపై ప్రభావం పడనుంది.

కాగా, 123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు బాణాసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన లేకున్నా, న్యాయస్థానం రైతుల పక్షాన నిలిచిందని వారు పేర్కొన్నారు. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నేతలతో సహా జేఏసీ నేత కోదండరాం కూడా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  123 GO  cancel  telangana  appeal  

Other Articles