Robbed in 90 seconds, Rs 15 lakh from unguarded bank in Ludhiana

Rs 15 lakh looted from punjab national bank branch in ludhiana

punjab national bank, pnb, pnb atm, punjab national bank atm, atm robbery, atm looted, punjab news, india news, Police, crime News, crime

In barely 90 seconds, four masked men robbed an unguarded Punjab National Bank (PNB) branch of Rs 15 lakh

మిట్టమధ్యాహ్నం బ్యాంక్ దోపిడి.. సెకన్లలో పూర్తి..

Posted: 08/02/2016 01:53 PM IST
Rs 15 lakh looted from punjab national bank branch in ludhiana

పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో మిట్టమధ్యాహ్నం బ్యాంకులో దోపిడి జరిగింది. కూతవేటు దూరంలో పోలిస్ స్టేష్టన్ వున్న.. ఎలాంటి జంకు బొంకు లేకుండా నిర్భయంగా దొంగలు తమ ప్రతాపాన్ని చాటి పోలీసులకు సవాల్ విసిరారు. ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో కేవలం 90 సెకన్ల వ్యవధిలోనూ తమ పని కానిచ్చేశారు. ఈ దోపిడిలో పాల్గొన్నది మాత్రం కేవలం నలుగురంటే నలుగురే వ్యక్తులు. అయితే ఎంత పక్కగా స్కెచ్ వేశారో.. ఎన్ని రోజుల నుంచి రెక్కీలు నిర్వహిస్తున్నారో తెలియదు కానీ నిమిషమున్నర వ్యవధిలోపు మొత్తం పని పూర్తిచేసేశారు.

పంజాబ్‌లోని లూథియానాలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ. 15 లక్షలు దోచేశారు. ఈ ఘటన సోమవారం మిట్ట మధ్యాహ్నం జరిగింది. ఆ బ్రాంచి కూడా కోచర్ మార్కెట్ పోలీసు పోస్టుకు సరిగ్గా 200 మీటర్ల దూరంలోనే ఉంది. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే సమయానికి బ్యాంకులో ఒక కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. ఈ సమాచారాన్నంతా ముందుగానే రెక్కీలు నిర్వహించిన దొంగలు పక్కగా రాబట్టారు. నిన్న మధ్యాహ్నం తమ స్కెచ్ ను పక్కగా అమలుపర్చి పారిపోయారు.

బ్యాంకు అధికారులు ఈ దోపిడిపై పోలీసులకు పిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం నలుగురు ముసుగు దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన అంకుశ్ చౌదరి అనే కస్టమర్‌ను కొట్టారు. ఇద్దరు దొంగలు లాబీలోనే ఉన్నారు. వాళ్లలో ఒకడు కౌంటర్ లోంచి క్యాషియర్ తలకు తుపాకి గురిపెట్టాడు. మూడో దొంగ మేనేజర్‌ను బంధించగా నాలుగో వ్యక్తి క్యాషియర్ వెనక్కి వెళ్లి, కొద్ది నిమిషాల క్రితమే కస్టమర్ డిపాజిట్ చేసిన రూ. 15 లక్షలు తీసుకున్నాడు.

అదే సమయానికి బ్యాంకు లోపలకు వస్తున్న ఓ మహిళ.. లోపల జరుగుతున్న విషయాన్ని చూసి వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. అందరికీ విషయం చెప్పారు. కానీ చుట్టుపక్కల వాళ్లు ఘటనపై ధైర్యం తెచ్చుకుని స్పందించేలోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కాగా పోలీసులు మాత్రం బ్యాంకు దోపిడీలో ఇంటిదోంగల ప్రమేయం వుండి వుంటుందని అనుమానిస్తున్నారు. ఈ బ్యాంకులో క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్ల ప్రమేయం కూడా వుండివుండవచ్చునన్న అనుమానాలతో వారి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles