యజమాని ఆఖరి క్షణాల్లో ఆ కుక్క ఏం చేసిందంటే... | dog visits terminally-ill owner in hospital to fulfill dying wish

Dog visits terminally ill owner in hospital to fulfill dying wish

Heart warming video viral, Dog visits terminally-ill owner, Brazil Heart warming video

Dog visits terminally-ill owner in hospital to fulfill dying wish, Heart warming video viral.

ITEMVIDEOS:ఈ ప్రేమలో ఏ మాత్రం కల్తీ లేదు

Posted: 08/02/2016 11:14 AM IST
Dog visits terminally ill owner in hospital to fulfill dying wish

పేరుకే మనుషులం కానీ.. మచ్చుకైనా మానవత్వమన్నది ఒకటి ఉందన్న విషయం మరిచి రాను రాను దుర్మార్గమైన పనులకు దిగుతున్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం.. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలన్న ఇంగితం జ్నానం కరువైపోతుంది. ప్రేమ అప్యాయతల మాట ఇక దేవుడే ఎరుగు. కానీ, ఆ విషయంలో మన కన్నా జంతువులే నయం అని నిరూపించుకుంటున్నాయి. తమ ప్రేమలో ఎలాంటి కల్మషం లేదని చూపిస్తున్నాయి. సరిగ్గా అలాంటి ఉదంతమే ఇక్కడ మనం చదవబోయేది.

బ్రెజిల్ కు చెందిన రీబాన్ చిలీ(49) అనే మహిళ కేన్సర్‌తో బాధపడుతూ ఆఖరి క్షణాల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పరిస్థితి చెయ్యి దాటిపోతుండటం గుర్తించిన వైద్యులు ఆమె ఆఖరి కోరిక తీర్చడానికి సిద్ధమయ్యారు. అందుకు ఆమె ఏం కోరిందో తెలుసా? ప్రేమగా పెంచుకున్న తన కుక్కను చూడాలని. స్పందించిన వైద్యులు ఆమె ఇంటి నుంచి దానిని తెప్పించారు. ఇక యజమానిని చూడగానే ఆమె పరిస్థితి తెలీని ఆ శునకం పాపం తోక ఊపుతూ ఆమె మీద పడిపోయింది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి లాగుతున్నా పట్టించుకోకుండా ఆమెను నాకుతూ ఒళ్లోకి ఒదిగిపోయింది. ఇక దానిని చూడగానే ప్రాణం లేచివచ్చినట్టుగా రీబాన్ ఒక్కసారిగా దానిని కౌగిలించేసుకుంది. ప్రేమతో తనివితీరా దానిని తడిమింది.

 

ఇదంతా చూస్తున్న డాక్టర్లు చలించిపోయి కంటతడిపెట్టుకున్నారు. మరికొందరు ఆ అరుదైన ప్రేమను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం అది లైక్ లు, షేర్లతో దూసుకుపోతుంది. కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలూ జంతువులు తిరిగి మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాయి. కానీ, మనుషులే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil  Dog  ill owner  video viral  

Other Articles