పోకెమాన్ తో అత్యాచారాలు పెరుగుతాయి | Andrew Cuomo wants sex offenders off Pokemon Go

Andrew cuomo wants sex offenders off pokemon go

New York Governor Andrew Cuomo, Pokemon for sex offenders, rapes with pokemon

New York Gov. Andrew Cuomo issued a directive Monday making the playing of online games like Pokemon Go a parole violation for sex offenders.

పోకెమాన్ తో రేప్ లు ఖాయమంటున్నాడు

Posted: 08/02/2016 10:40 AM IST
Andrew cuomo wants sex offenders off pokemon go

పోకెమాన్ గో ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఓ ఆట. అయితే సరదాగా ఆడుతున్న ఈ ఆట రాను రాను ప్రమాదకరంగా మారిపోతుంది. పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా పరధ్యానంలో మునిగిపోయి ఆడుతుండటంతో యాక్సిడెంట్లకు కారణమవటమే కాదు. చాలా మంది తమ ప్రాణాలను కూడా పొగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరుడుగట్టిన రేపిస్టులకు పోకెమాన్ అందుబాటులో ఉండటానికి వీల్లేదు అంటున్నాడు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో.

రాష్ట్రంలో 3 వేల మందికి పైగా అత్యాచార కేసుల్లో శిక్షలను అనుభవిస్తూ, పెరోల్ పై ఉన్నారని, గేమ్ ఆడుతూ వీరి చేతికి చిక్కితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయా నేరస్థుల చిరునామాలు, వాళ్లు ఎక్కడ తిరుగుతుంటారన్న విషయాలు పోలీసులకు తెలుసునని అంటున్న ఆయన, ఆయా ప్రాంతాల్లో పోకేమాన్ లను ఉంచరాదని, అంతేకాదు వారిని ఆడటానికి కూడా అనుమతించొద్దని గేమ్ సృష్టికర్తలను కోరుతున్నాడు. రేపిస్టుల వివరాలు, చిరునామాలను నింటెండో, నియాంటిక్ సంస్థలకు పంపాలని సోమవారం ఆయన నగర పోలీసులను ఆదేశించారు కూడా.

గేమ్ పరిధిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ డెవలపర్లకు ఈ-మెయిల్స్ పంపారు. ఆటలో నిమగ్నమై ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి అపాయాల బారిన పడితే వారిని కాపాడేది ఎవరని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా గేమ్ ఆడుతున్నారని, వారిలో చిన్నారులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, న్యూయార్క్ మేయర్ ప్రకటనపై నింటెండో సంస్థ ఇంకా స్పందించలేదు.

అయితే '13 ఏళ్ల దాటిన వారు మాత్రమే రిజిస్ట్రేషన్ ద్వారా పోకెమాన్ గో గేమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు' అని ఆ సంస్థలు చెబుతున్నప్పటికీ, దాని ప్రభావంతో నేరాలు పెరిగే అవకాశం ఉందన్న వాదనను చాలా మంది ఒప్పేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pokemon go  New York Governor  Andrew Cuomo  sex offenders  

Other Articles