కుక్క పిల్లల్ని మంటల్లో వేసి మరీ చంపారు | Hyderabad youth kill puppets trowing into flames

Hyderabad youth brutually kill dog puppets by throwing into flames

Hyderabad youth kill puppets, dog puppets in flames, dog puppets killed in Hyderabad, youth throw dog into flames

Hyderabad youth brutually kill dog puppets by throwing into flames.

ఒళ్లు జలదరించే రీతిలో వాటిని చంపారు

Posted: 07/20/2016 05:36 PM IST
Hyderabad youth brutually kill dog puppets by throwing into flames

ఇటీవల చెన్నై లో ఓ మెడికో సైకోలా ఓ కుక్కను మేడ మీద నుంచి విసిరేయటం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సెలబ్రిటీలు కూడా దుర్మార్గపు చర్యపై తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే అంతకు మించిన దారుణమైన ఘటన హైద‌రాబాద్‌లో ఇప్పుడు చోటు చేసుకుంది.

ముషీరాబాద్ కు చెందిన ఆరుగురు యువకులు మదమెక్కి కుక్క పిల్లలను పైశాచికంగా చంపారు. ఆ అకృత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కుక్క పిల్లలను పట్టుకోవడం, తల్లి నుంచి వేరు చేసి కర్రలతో కొట్టడం, మంట వేసి ఆ కుక్క పిల్లలను వేయడం, అవి మంటలను తట్టుకోలేక బయటకు పారిపోతుంటే, పట్టుకొని మరీ అందులో వేయడం, చివరకు అవి సజీవ దహనం కావడం.. ఆ వీడియోలో ఉంది.

ఇక విష‌యాన్ని తెలుసుకున్న సైబ‌ర్‌ పోలీసులు ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని, వారిపై కేసు న‌మోదు చేశారు. స‌ర‌దాకు ఈ ప‌నిచేశామ‌ని యువ‌కులు చెబుతుండగా, ఆ నీచపు పనికి సర్వత్రా మండిపడుతున్నారు. జంతు ప్రేమికులను క‌ల‌చివేసిన ఆ వీడియోను నెట్ లోంచి తొలగించారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Youth  Dog  Puppets  Flames  Killed  

Other Articles