Short Films Actress Siri Priya seeks police protection from husband's family

Actress siri priya approaches police for protection

Actress Siri Priya seeks police protection, actress siri priya love marriage, siri priya seeks protection from her beau parents. actress siripriya, prasanna kumar, love marriage, rajanagaram police, facebook friends, romantic short films, aame korika, aame korika actress, actress siri priya, siripriya, sri priya, celebrities, samarlakota, east godavari, andhra pradesh

Short film actress Siri Priya has approached Rajanagar police in East Godavari district for protection from the parents of her beau Prasanna Kumar, a B.tech student, who she married recently.

ITEMVIDEOS: భర్త కుటుంబం నుంచి రక్షణ కల్పించండీ: సినీనటి సిరిప్రియ

Posted: 07/19/2016 06:46 PM IST
Actress siri priya approaches police for protection

సినీనటి సిరిప్రియకు కూడా అత్తారింటి అరళ్లు తప్పడం లేదు. తన భర్తతో అమెను కలవనీయకుండా అడ్డుపడుతున్నారని అమె పోలీసులను అశ్రయించింది. తన గురించి తన భర్తకు వారు కట్టుకథలు చెప్పి మనసు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అరోపిస్తూ.. తన భర్త కుటుంబ సభ్యుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసుల్ని ఆశ్రయించింది. అదేంటి సినీనటిని పెళ్లి చేసుకున్నంత మాత్రన పెళ్లినే అడ్డుకుంటారా..? అన్న ప్రశ్నలు లేవనెత్తడం సహజం. అయితే ఇక్కడే ఒక చిక్కువచ్చింది.

అమె నటించి చిత్రాలన్ని షార్ట్ ఫిల్మ్ లే కావడం గమనార్హం. తాజాగా అమె నటించిన అమె కోరిక చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే పేరు చూడగానే ఆ చిత్రంలోనూ అమె పాత్ర ఎలా వుండబోతుందో అర్థయవుతుందని.. అన్నవారు లేకపోలేదు. సినిమాల్లో హీరోయిన్లు రోమాన్స్ చేయడం సహజం అంతమాత్రాన వారి మధ్య ఏదో వుందని అనడం తప్పు అవుతుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే అసలు సిరిప్రియ ప్రేమ వ్యవహారం వివరాల్లోకి వేళ్తే కూడా అదే జరిగింది.

ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ప్రసన్నకుమార్ తో సరిప్రియ అలియాస్ చంద్రకళ ప్రేమలో పడింది, గత ఆరేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ప్రేమ పరిణయానికి కూడా దారితీసింది. అయితే పెద్దలు అంగీకారం లభించదని ప్రసన్నకుమార్ చెప్పడంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రసన్నకుమార్ కుటుంబసభ్యులు  అడ్డు చెప్పడంతో సిరిప్రియ పోలీసులను రక్షణ కోరింది. కాగా ప్రసన్నకుమార్  బీటెక్ చదువుతున్నాడు.

ఈ సందర్భంగా సిరిప్రియ మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీ అంటే చాలామందికి చులకన భావం అని అందుకే తన భర్త కుటుంబసభ్యులు తమ పెళ్లిని అంగీకరించడం లేదని తెలిపింది.  తన క్యారెక్టర్ మంచిది కాదని, అతడిని ట్రాప్ చేసినట్లు ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారని, తన భర్తను కలవనివ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తాను గతంలో యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశానని, అయితే అది ప్రొఫెషన్ మాత్రమే అని సిరిప్రియ పేర్కొంది. బతుకుదెరువు కోసమే నటిస్తున్నానని, తనకు కొంత సమయం ఇస్తే మరో ఉపాధి చూసుకుంటానని ఆమె తెలిపింది. ప్రసన్నకుమార్ కుటుంబసభ్యులతో భవిష్యత్లో ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున పోలీసుల్ని ఆశ్రయించినట్లు సిరిప్రియ చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles