విమానం రద్దయితే నష్టపరిహరం చెల్లించాల్సిందే | Cancelling a flight or denying boarding to a flier will cost airlines dear

Cancelling a flight or denying boarding to a flier will cost airlines dear

DGCA new rules, Cancelling a flight or denying boarding, airlines in Indian should pay charges, domestic airlines cancelling a flight

Cancelling a flight or denying boarding to a flier will cost airlines dear with DGCA new rules.

ఫ్లైట్ రద్దయితే ఇక నుంచి పండగే

Posted: 07/18/2016 02:55 PM IST
Cancelling a flight or denying boarding to a flier will cost airlines dear

ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ కమిటీ డీజీసీఏ(డైరక్టర్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తీసుకున్న కొత్త నిర్ణయాలతో ప్రయాణికుల పంట పడనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీతో ప్రయాణికుల ల‌గేజీ ఛార్జీలను భారీగా త‌గ్గించే నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ మరోపక్క విమానం క్యాన్సిల్ మాత్రం అయితే టికెట్ ధ‌ర‌తో పాటు అద‌న‌పు ప‌న్నుల రూపంలో వ‌సూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాల్సిందేనని చెబుతోంది.

రెండుగంటల లోపు విమానం ర‌ద్దయితే 10వేల రూపాయ‌లు చెల్లించాలి. గతంలో ఇది కేవలం 4 వేలుగా ఉండగా, ఇప్పుడు దీన్ని అమాంతం పెంచేసింది. దీంతోపాటుగా 24 గంట‌ల‌ లోపు వేరే విమానాన్ని సమకూర్చలేకపోతే మరో రూ.20వేలు ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని అందులో పేర్కొంది. 24 గంటల తర్వాత కూడా ప్రయాణానికి ఏర్పాటు చేయకపోతే ఒకవైపు బేసిక్‌ రేటుతోపాటు ఇంధన చార్జీలు కలుపుకుని 400శాతం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణికుడు ఆ విమానాన్ని వద్దనుకుంటే ఈ 400 శాతం నష్టపరిహారంతోపాటు టిక్కెట్‌ ధర పూర్తిగా వాపస్‌ చేయాలి. టికెట్ క్యాన్సిల్ అయితే అద‌న‌పు ప‌న్నుల‌తో స‌హా చార్జీలను ప్రయాణికులకు రీఫండ్ చేయాల‌ని చెప్పింది. దేశీయ ప్రయాణాల‌కైతే 15 రోజుల్లోగా, అంత‌ర్జాతీయంగా అయితే 30 రోజుల్లోగా ఈ రీఫండ్ చెల్లించాల‌ని స్పష్టం చేసింది.

అంటే ఇకపై విమానం ఆలస్యమైనా....రద్దయినా ఆయా విమానయాన సంస్థ సదరు ప్రయాణికుల‌కు భారీ ప‌రిహారం చెల్లించాల్సి వస్తుంది. త్వరలోనే అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలతో దేశీయ విమానయాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టడం ఖాయమని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airlines in India  DGCA new rules  Flight cancellation  

Other Articles