Journalist Mehr Tarar questioned in sunanda case, denies proximity to Shashi Tharoor

Mehr tarar quizzed for 3 hours in sunanda case

sunanda pushkar, mehr Tarar, shashi Tharoor, nalini singh, Indian police, pakistan high Commission, investigation officer, VK Yadav, delhi police, romantic liasion, sunanda pushkar death, murder sunanda pushkar, shashi tharoor, tharoor, mehr tarar sunanda pushkar, sunanda pushkar murder, shashi tharoor wife, objectionable emails, New delhi, central delhi five star hotel, BBM messages, twitter,

Pakistan-based columnist Mehr Tarar, came to India two, three months ago for the questioning, which was conducted at a five-star hotel in central Delhi.

శశిథరూర్ తో నాకెలాంటి సంబంధం లేదు: మెహర్ తరార్

Posted: 07/18/2016 12:57 PM IST
Mehr tarar quizzed for 3 hours in sunanda case

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సునందా పుష్కర్ మృతి కేసులో పాకిస్థాన్ రచయిత్రి మెహర్ తరార్ ను ప్రశ్నించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాజీ కేంద్రమంత్రి శశిధరూర్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అమె తేల్చిచెప్పినట్లు తెలుసింది. శశిధరూర్ 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం అమెను వివాహం చేసుకుంటాడన్న వార్తలను కూడా అమె తోసిపుచ్చారు. రెండు మూడు నెలల క్రితం భారత్ కు వచ్చిన అమెను సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో మహిళా పోలీసు అధికారుల సమక్షంలోనే ఈ కేసును దర్యాప్తు అధికారి వికే యాదవ్ తరార్ ను ప్రశ్నించినట్లు సమాచారం.  

2014 జనవరి 17 సునందా పుష్కర్ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సరిగ్గా మెహర్ తరార్ తో ట్వట్టర్ అనుసంధానంగా జరిగిన గొడవ వెలుగుచూసిన మరుసటి రోజునే అమె మరణించడంతో ఈ కేసులో మెహర్ తరార్ వాంగ్మూలం కూడా అత్యంత అవసరమని భావించిన అధికారులు.. గత ఏడాది డిసెంబర్ లో ఈ కేసు దర్యాప్తు కోసం సహకరించాలని కోరుతూ తరార్ కు లేఖ రాశారు. కాగా, దీనిపై స్పందించిన అమె ఫిబ్రవరి చివరి వారంలో తాను దర్యాప్తుకు సహకరిస్తానని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు లేఖ రాశారు. గత రెండు, మూడు నెలల క్రితం అమె ఢిల్లీకి వచ్చి వాంగ్మూలం ఇచ్చారని సమాచారం.

సునంద పుష్కర్ తో ఏమైనా విభేదాలున్నాయా అనే దానిపై మెహర్ ను అధికారులు అడిగినట్టు సమాచారం. శశి థరూర్తో తనకు సాన్నిహిత్యం లేదని ఆమె వెల్లడించినట్టు తెలిసింది. ఆయనతో తనకు సంబంధం ఉందన్న ఆరోణలను ఆమె తోసిపుచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద్ స్నేహితురాలు నళిని సింగ్  చేసిన ఆరోపణలను కూడా మెహర్ కొట్టిపారేశారు. శశిథరూర్ లేకుండా తాను వుండలేకపోతున్నానని.. ఈ మేరకు తాను ట్విట్టర్ లో మేజేస్ లు పెట్టానని నళిని సింగ్ చేసిన అరోపణల్లో కూడా వాస్తవం లేదని తరార్ చెప్పుకోచ్చారు.

శశిథరూర్ కు తనకు మధ్య ఎలాంటి అభ్యంతరకరమైన బిబిఎం మేసేలు, ఈమెయిల్స్ పంచుకోలేదని చెప్పారు. అమెను సుమారు గంటల పాటు ప్రశ్నించి అధికారులు అమె ఇచ్చన సమాధానాలతో.. తమ దర్యాప్తులో వెల్లడైన ఇతర వివరాలను కూడా సరిపోల్చుతున్నారు. ఈ కేసులో మెహర్ తరార్ వెల్లడించిన విషయాలు చాలా కీలకమైనవిగా దర్యాప్తు అధికారులు బావిస్తున్నారు. అయితే తరార్ ను ప్రశ్నించేందుకు తమకు అధికారాలు లేవని, అందుచేత పాకిస్తాన్ హై కమీషన్ ను సంప్రదించి ఈ మేరకు అనుమతి తీసుకున్నామని కూడా అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles