రమ్య తాత మృతి | Panjagutta accident ramya grandpa madhusudhanachari also died

Panjagutta accident ramya grandpa madhusudhanachari also died

panjagutta accident, baby ramya case, ramya grandpa, ramya grandpa madhusudhanachary died, panjagutta accident another death

Panjagutta accident ramya grandpa madhusudhanachari also died.

రమ్య ఇంట మరో విషాదం

Posted: 07/18/2016 09:07 AM IST
Panjagutta accident ramya grandpa madhusudhanachari also died

పీకలదాకా తాగి, కన్నుమిన్నూ కానక తాగుబోతు పిశాచాలు చేసిన పైశాచికానికి ఆ కుటుంబంలో మరోసారి విషాదాన్ని నింపాయి. పంజాగుట్ట యాక్సిడెంట్ లో ఇప్పటికే చిన్నారి రమ్య బలికాగ, తాజాగా చికిత్సపొందుతుతన్న ఆమె తాతయ్య మధుసూధనాచారి మృతి చెందారు. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన ఆయన ఆరోగ్యం విషయమించడంతో వారం రోజులుగా ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తుండగా, సోమవారం ఉదయం కన్నుమూశారు.

జూలై 1వ తేదీన పంజాగుట్ట దగ్గర పూటుగా తాగి అతి వేగంతో కారు నడుపుకుంటూ వస్తున్న బీటెక్ విద్యార్థి వీరిని యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఘటనలో రమ్య బాబాయి రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, వారం రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన రమ్య కేర్ ఆసుపత్రిలో మరణించింది.

ఇక ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఆమె తాతయ్య మధుసూదనాచారి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించారు. మూడు వారాల వ్యవధిలో ఒకే ఇంట ఇది మూడో మరణం. ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రమ్య తల్లి రాధిక మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంట్లోనే చికిత్స తీసుకోంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panjagutta accident  baby ramya  grandpa  madhusudhanachary  death  

Other Articles