Show me how inflation is very low, Raghuram Rajan's challenge to critics

Raghuram rajan says has no immediate plans of writing a tell all book

Raghuram Rajan,Reserve Bank of India ,RBI,gross domestic product,GDP,consumer price index,CPI,inflation,Bharatiya Janata Party,Subramanian Swamy,universal payment interface,UPI , Show me how inflation is very low, Raghuram Rajan's challenge to critics,news, India news,Finance News,Finance News in India

RBI Governor Raghuram Rajan has challenged them to show how inflation is “very low” before accusing him of “being behind the curve” in his focus on containing price rise than on growth and debunked such criticism as mere ‘dialogues’.

సుబ్రహ్మణ్య స్వామికి రఘురామ్ రాజన్ సవాల్..

Posted: 07/18/2016 08:09 AM IST
Raghuram rajan says has no immediate plans of writing a tell all book

తనపై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తిప్పికొట్టారు. అంతేకాదు అర్థరహిత విమర్శలు చేయడం కాదు వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా బీజేపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన విమర్శలపై అయన తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిక వడ్డీ రేట్ల విధానంతో వృద్ధికి అడ్డుపడుతున్నారంటూ తనను విమర్శించే వారు ముందుగా ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉందని చూపించాలంటూ సవాల్ చేశారు. అడ్డంకులున్నా దేశ జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.

వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతున్నారని, వృద్ధికి అడ్డు పడుతున్నారన్న విమర్శలపై నేను దృష్టి పెట్టను. వరుసగా నాలుగో నెల జూన్‌లోనూ వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగి 5.77 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. మా పాలసీ రేటు 6.5 శాతంగానే ఉంది. ఈ అంశంపై జరిగే చర్చ ఆర్థిక ప్రాతిపదికన కాకుండా ఉండాలి’ అని అన్నారు. తనను విమర్శించే వారు... వడ్డీ రేట్లను తగ్గించేందుకు ద్రవ్యోల్బణం తక్కువగానే ఎలా ఉందో చెప్పాలని సవాల్ చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధికే పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు ఇటీవలి కాలంలో రాజన్ విధానాలను తప్పుబట్టిన విషయం తెలిసిందే.

‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతమున్న సవాళ్లే కొంత కాలం పాటు కొనసాగుతాయి. ఆర్థిక పురోగతి తీరుపై ఎంతో నిరుత్సాహం నెలకొని ఉంది. కానీ, రెండేళ్ల వరుస కరువుతోపాటు అంతర్జాతీయంగా మందగమనం నెలకొని ఉంది. అలాగే, బ్రెగ్జిట్ వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు సైతం ఎదురయ్యాయి. ఈ అడ్డంకులున్నా దేశీయ వృద్ధి మంచిగానే ఉంది. వర్షాలు తగినంత కురిస్తే వ్యవసాయ రంగం మెరుగుపడుతుంది. గ్రామీణ వినియోగం పెరగడం ద్వారా మొత్తం మీద ఆర్థిక రంగం ఊపందుకుంటుంది. కానీ, ఇవి అంచనాలే. వాస్తవంగా ఏం జరుగుతుందో చూడాలి’ అని రాజన్ వివరించారు. మంచి వర్షాలు కురిసి, అంతర్జాతీయ ఆర్థిక రంగం మెరుగుపడితే జీడీపీ 7.6 శాతంగా ఉంటుం దన్న తమ అంచనాల్లో మార్పు ఉంటుందన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuram rajan  reserve bank of india  subramanian swamy  critics  challenge  

Other Articles