Rubber tapper woman wins Rs 1 crore in state lottery

Congress launched lottery gives rubber tapper huge relief

kerala, lottery, kerala lottery, kerala lottery prize, lottery prize money, kerala lottery woman, kerala lottery money, congress, UDF, lottery, Nabeesa, rubber tapper, Stree Shakti lottery, Kilimanoor, Thiruvananthapuram district, kerala, india bulls, shila dixit, shikar dhawan, anil kumble, kerala news, india news

The windfall has come as a huge relief to her family, comprising her sick mother and a younger sister, who lost one of her legs in an accident some years ago, as they were finding it difficult to make ends meet.

కాంగ్రెస్ లాటరీతో.. అమె కష్టాలకు చెక్..!

Posted: 07/14/2016 07:32 PM IST
Congress launched lottery gives rubber tapper huge relief

శీర్షిక చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి అమెకు బంఫర్ ఆఫర్ వచ్చిందనుకుంటున్నారు కదూ, కానీ కాదు. అయితే అమెకు దక్కింది మాత్రం బంఫర్ ఆఫరే. అది కూడా అమెకున్న కష్టాలన్నీ తీరిపోయే బంఫర్ ప్రైజ్ మనీ అఫర్. అదేంటి అంటారా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయల బంఫర్ అఫర్. కేరళలోని రబ్బరు తోటల్లో పనిచేసే ఓ మహిళకు ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలడం.. అమె కష్టాలన్నీ ఒక్కసారిగా దూరం కావడం అంటే బంఫర్ అఫరే కదండీ.

వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురం జిల్లాలోని కిలిమనూరుకు చెందిన నబీసాకు మొదటి బహుమతిగా కోటి రూపాయలను గెలుచుకుంది. దీంతో నబీసా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. జబ్బుతో బాధపడుతున్న తల్లి, ఓ ప్రమాదంలో కాలు కోల్పోయిన చెల్లిని పోషించాల్సిన బాధ్యతను నెత్తిపై వేసుకున్న నబీసాకు ఈ లాటరీతో ఊపిరి వచ్చినట్టయింది. గతంలోనూ చాలాసార్లు లాటరీ టికెట్లు కొన్న ఆమె మూడుసార్లు రూ.5వేల బహుమతిని, చాలాసార్లు వెయ్యి రూపాయల బహుమతి గెలుచుకుంది. లాటరీలో తగిలిన కోటి రూపాయల్లో కొంత ఖర్చు చేసి ఓ ఇల్లు కొనుక్కుంటానని నబీసా పేర్కొంది. దివ్యాంగురాలైన తన సోదరితో స్టేషనరీ షాపు పెట్టిస్తానని చెప్పుకొచ్చింది.
 
అయితే దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమేంటి అంటున్నారు కదూ..? అక్కడికే వస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని నిరుపేద మహిళల సహాయార్థం.. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూడీఎఫ్ ప్రభుత్వం ఈ స్త్రీశక్తి లాటరీని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మొదట్లో ఈ లాటరీని ప్రవేశపెట్టినా.. ప్రతి వారం రోజులకు ఒకమారు డ్రా వెలువడుతుండటంతో అప్పుడూ 11వ డ్రా వచ్చేసింది. నబీసా రాష్ట్ర ప్రభుత్వ 11వ స్త్రీ శక్తి లాటరీ గెలుచుకుంది, వీక్లీ లాటరీ అయిన దీని టికెట్ ధరను ఇటీవల రూ.40 నుంచి రూ.50కి పెంచారు. లాటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం మహిళా సంరక్షణ, పునరావాసం తదితర వాటికోసం ఖర్చు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles