మొగుడి శవంతో పిల్లల్ని కంటుందట??? | Widow asks AIIMS doctors for baby with husband's dead body

Widow asks aiims doctors for baby with husband s dead body

dead man sperm, AIIMS doctors requested by woman for dead husband, Woman seeks her husband sperm after death

Widow asks AIIMS doctors to collect his dead husband sperm for her Pregnancy.

మొగుడి శవంతో పిల్లల్ని కంటుందట!!!

Posted: 07/11/2016 10:37 AM IST
Widow asks aiims doctors for baby with husband s dead body

ఇదోక విచిత్రమైన సంఘటన. చనిపోయిన తన భర్త ద్వారా పిల్లల్ని కంటానని వాదిస్తోంది. తన భర్త శవాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. ఇందుకోసం వైద్యులు సహకరించాలని విజ్నప్తి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఈ ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

ఎయిమ్స్ దగ్గర ఓ పాతికేళ్ల యువతి ఇప్పుడు పోరాటానికి దిగింది. సంతానం కోసం తన భర్త నుంచి వీర్యకణాలు సేకరించి తన గర్భంలోకి ప్రవేవపెట్టాలని కోరుతోంది. ఆ దంపతులకు కొన్నాళ్ల క్రితం పెళ్లయ్యింది. కానీ, సంతానం లేరు. ఈలోగా భర్త ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీంతో చనిపోయిన తన భర్త ద్వారా సంతానం పొందుతానని ఆమె అంటోంది. దీనికి ఆమె తల్లిదండ్రులు కూడా మద్ధతుగా నిలిచారు. అయితే ఇందుకు వైద్యలు నిరాకరిస్తున్నారు.

చనిపోయిన వ్యక్తి వీర్యకణాలు సేకరించడంపై చిక్కులు ఉన్నాయని వారు చెబుతున్నారు. అందుకు వైద్య నిబంధనలు ఒప్పుకోవనేది వారి వాదన. అయితే ఓ వ్యక్తి మరణిస్తే అతనిలో 24 గంటలపాటు వీర్యకణాలు బతికే ఉంటాయని, వాటిని టెస్టిస్ నుంచి వేరు చేసి భద్రపరచడం అనేది చాలా తేలికైన ప్రక్రియ అనే ఎయిమ్స్ కే చెందిన ప్రముఖ డాక్టర్ సుదీర్ గుప్తా చెబుతున్నారు. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఇలాంటి పనులకు అనుమతులు ఉన్నా... మన దగ్గర మాత్రం చట్టవిరుద్దమని ఆయన వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIIMS  woman  dead Husband  Sperm  

Other Articles