టీ, సమైక్య ఉద్యమాలు పెద్ద సినిమాలంటున్న ఎంపీ | TG Venkatesh intresting comments at Vysya Federation Meeting In Karimnagar

Tg intresting comments at vysya federation meeting in karimnagar

TG venkatesh in karimnagar, TG about telangana govt, TG venkatesh and Etela Rajendra

Kurnool TDP leader TG Venkatesh Participates In International Vysya Federation Meeting In Karimnagar. Says telugu people always together.

ITEMVIDEOS:టీ, సమైక్య ఉద్యమాలు పెద్ద సినిమాలంటున్న ఎంపీ

Posted: 07/11/2016 11:57 AM IST
Tg intresting comments at vysya federation meeting in karimnagar

60 ఏళ్ల కల, 14 ఏళ్ల ఎడతెరవని ఉద్యమం, ఐదేళ్ల సకల జన కార్యదీక్ష కలగలిపి తెలంగాణ పోరాటం. మరోవైపు కలిసుంటేనే కలదు సుఖం.. విడిపోతే తీరని దు:ఖం అంటూ... విడిపోవటానికి ఏ మాత్రం ఇష్టపడని ఏపీ నేతల ఆరాటం (పోరాటం తక్కువ కాబట్టి)... చివరకు ఏమైతేనేం నాలుగుకోట్ల ప్రజల అకాంక్షే నెరవేరింది. రెండేళ్లు గడిచాయి కూడా. గతం తల్చుకోవటం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వర్తమానంలో పురోగతి సాధిస్తూ, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండు దేశంలోనే టాప్ పొజిషన్ లో నిలవాలి అని ప్రతీ ఒక్కరూ కొరుకుంటున్నారు.

ఈ సమయంలో తెలుగు దేశం సీనియర్ నేత, ఎంపీ టీజీ వెంకటేష్ మనసులో ఏముందో ఒకసారి చూద్దాం. అప్పట్లో రాష్ట్రం ముక్కలయితే ఏం జరుగుతుందోనన్న భయంతోనే పోరాటం చేశామని చెబుతున్నాడయాన. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక తొలిసారి తెలంగాణలో పర్యటించారు. కరీంనగర్ లో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహాసభల్లో ఈ రాజ్యసభ ఎంపీ కూడా పాల్గొన్నారు.

గతం గురించి ప్రస్తావిస్తూ... తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు సినిమా సీన్ల వంటివని, వాటిని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు రాష్ట్రాలూ ఇప్పుడు ముందడుగు వేస్తున్నాయని, ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ, అన్నదమ్ముల్లా ఎప్పటికీ కలుసుంటామని టీజీ వ్యాఖ్యానించారు. ఇక్కడ నివసించే ఏ ప్రాంత పౌరులైన తెలంగాణకి చెందిన వారే అని, వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ఉంటుందని మంత్రి ఈటెల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈటెల పక్కనే కూర్చున్న టీజీ ఇక్కడి నేతలతో కలిసిపోయి స్టేజీ మీద సందడి చేయటం ఆసక్తిగా కనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kurnool  TDP  TG Venkatesh  karimnagar  Vysya Federation Meeting  

Other Articles