చిన్న పేపర్ ముక్కతో లక్షలు కొట్టేశాడు | Man steal from a Singapore bank using a piece of paper

Man steal from a singapore bank using a piece of paper

Singapore bank robbery, man robbery with a piece of paper, bank robbery with out weapons

Man robbery a bank with a piece of paper in Singapore, search began.

చిన్న పేపర్ ముక్కతో లక్షలు కొట్టేశాడు

Posted: 07/09/2016 10:48 AM IST
Man steal from a singapore bank using a piece of paper

సింగపూర్ నేరాలు చాలా తక్కువగా నమోదయ్యే దేశం. ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు అక్కడ చాలా తక్కువగా జరుగుతుంటాయి. కఠినమైన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయటంలో ప్రభుత్వం విజయవంతం కావటమే దీనికి కారణం. అలాంటిది ఎలాంటి ఆయుధం లేకుండా ఓ వ్యక్తి బ్యాంకును లూటీ చేయడం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది.

గురువారం సింగపూర్ లోని స్టాండర్డ్ బ్యాంకు లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి క్యాష్ కౌంటర్ లోని సిబ్బందికి తలా ఓ కాగితం ఇచ్చాడు. అది చూశాక సిబ్బంది అతనికి బ్యాగుల్లో 30 వేల జీఎస్డీ (22 వేల డాలర్లు) అంటే మన కరెన్సీలో 14 లక్షల రూపాయలు అందజేశారు. అది తీసుకుని అతగాడు తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై బ్యాంకు సిబ్బంది కేసు నమోదు చేయగా, అతను ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తూ గాలింపు చర్యలు చేపట్టారు.

అసలు ఆయుధం లేకుండా అతగాడు ఎలా దొంగతనం చేశాడు అన్న విషయాన్ని పక్కనబెడితే ఆ పేపర్ లో ఏం రాసి ఉంది అన్న విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడం లేదు. సింగపూర్ చట్టం ప్రకారం ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం చాలా తీవ్రమైన నేరం. అందుకే దొంగలు కూడా ఆయుధాలు వాడేందుకు భయపడుతుంటారంట. గతంలో 2008లో ఓ వ్యక్తి తన బ్యాగులో బాంబ్ ఉందని బెదిరించి దొంగతనానికి ప్రయత్నించగా, సిబ్బంది అతడిని చితకొట్టి పోలీసులకు అప్పజెప్పారు. ఇప్పుడు కూడా అలా బెదిరించే దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singapore  bank  robbery  no weapons  piece of paper  

Other Articles