హర్ధిక్ పటేల్ కు విముక్తి... ఆపై షాక్ | Hardik Patel expelled from Gujarat for 6 months

Hardik patel expelled from gujarat for 6 months

Hardik Patel expelled, Gujarat High Court Hardik Patel, Hardik Patel expelled from Gujarat

Gujarat High Court granted conditional bail to Hardik Patel. But, expelled him 6 months from state.

హర్ధిక్ పటేల్ కు విముక్తి... ఆపై షాక్

Posted: 07/08/2016 04:39 PM IST
Hardik patel expelled from gujarat for 6 months

జాతి విద్రోహం కేసులో అరెస్టయి తొమ్మిది నెలలుగా జైళ్లోనే మగ్గుతున్న గుజరాత్ యువ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ కి ఎట్టకేలకు విముక్తి లభించింది. శుక్రవారం అతనికి షరతుల మీద బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఊరట ఇచ్చినట్లే ఇచ్చి గుజరాత్ హైకోర్టు పెద్ద దెబ్బే వేసింది.

రాష్ట్రం నుంచి హార్దిక్ ను ఆర్నెల్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015లో గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటంతోపాటు, పటేల్ వర్గాన్ని రెచ్చగొట్టి దాడులు చేయించాడని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రజా సమావేశాలలో ఆయుధాలు ప్రదర్శించడంతో అతనిపై కేసు నమోదైంది. చివరకు పోలీసులను చంపాలంటూ వ్యాఖ్యానించడంతో కేసు నమోదు చేసుకుని అతని కటకటాల వెనక్కి నెట్టారు.

తమ వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో హార్దిక్ గుజరాత్ లో పటేల్ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. యువ నేతగా అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ పై జాతి విద్రోహ కేసులో తొమ్మిది నెలల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆర్నెలపాటు రాష్ట్రం నుంచి వెలేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా, ఈ తీర్పుపై పై కోర్టుకు అప్పీల్ చేస్తామని హర్ధిక్ తరపు న్యాయవాది చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  High Court  Hardik Patel  conditional bail  6 months  expell  

Other Articles

Today on Telugu Wishesh