ప్రొడ్యూసర్ అల్లుడు రేప్ చేసింది ఎవరినంటే... | Film nephew raped hid wife case registered

Film nephew raped hid wife case registered

Bollywood film producer nephew rape, rape case against producer nephew, producer nephew arrested

A Bollywood film producer's nephew was booked after his wife approached the police recently and accused him of harassment and rape.

రేప్ కేసులో టాప్ ప్రొడ్యూసర్ అల్లుడు

Posted: 07/08/2016 03:00 PM IST
Film nephew raped hid wife case registered

ఓ టాప్ ప్రొడ్యూసర్ మేనల్లుడిపై రేప్ కేసు నమోదు కావటం సంచలనం సృష్టిస్తోంది. ముంబైకి చెందిన సదరు నిర్మాత అల్లుడు ఆయన ప్రొడక్షన్ హౌజ్ లోనే ఇంచార్జిగా పని చేస్తున్నాడు. ఇంతకీ ఆయనపై రేప్ కేసు పెట్టింది ఎవరో తెలుసా.. స్వయానా అతని భార్యే.

గత కొద్దిరోజులుగా ఆ వ్యక్తి తన భార్యతో ఇష్టం లేకుండానే శృంగారంలో పాల్గొంటున్నాడని, అసహజమైన రీతిలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ అతని భార్య వెర్ సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన నగలను లాక్కుని అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడని అందులో పేర్కొంది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. నిజానిజాలు పరిశీలించాకే అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. సదరు నిర్మాత గతంలో గోవిందా, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీయటంతోపాటు కొన్ని హిట్ సీరియల్స్ ని కూడా నిర్మించాడంట. ప్రస్తుతం బాలీవుడ్ లోకి రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సదరు నిర్మాత, ఆయన మేనల్లుడి వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  film producer  nephew  wife  rape case  

Other Articles