అందమైన కన్య... వయసు 12 ఏళ్లు... రేటు 8.5 లక్షలు. ఎక్కడా? | ISIS solding sex slaves via Whatsapp and telegram app

Is solding sex slaves via whatsapp and telegram app

ISIS sex slaves, Beautiful sex slaves, sex slaves videos, ISIS sold girls, Yazidi sex slaves

ISIS solding sex slaves via Whatsapp and telegram app.

అందమైన కన్య.. రేటు 8.5 లక్షలు... త్వరపడండి

Posted: 07/08/2016 02:06 PM IST
Is solding sex slaves via whatsapp and telegram app

సౌదీ దేశాల్లో ఒక ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది. ‘‘అందమైన అమ్మాయి. వయసు 12 ఏళ్లు. కన్నెపిల్ల... ధర ఇప్పటికి రూ. 8.5 లక్షల వరకు వెళ్లింది.. త్వరలోనే అమ్ముడుపోతుంది. ఎక్కువకు పాడి మీరూ సొంతం చేసుకోండి... త్వరడండి’’ అంటూ అరబిక్ భాషలో ఉంది. అమ్మాకాలు, కొనుగోలుకు సంబంధించిన ఓ ఆన్ లైన్ సైట్లో ఈ ప్రకటన దర్శనమిస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడిది?

శృతి మించిపోతున్న ఉగ్రరాక్షసుల పరాకాష్టకు నిదర్శనమిది. ఐఎస్ ఐఎస్ తరపునే ఈ ప్రకటన జారీ అయ్యింది. వారి చేతుల్లో అతి కిరాతకంగా అత్యాచారానికి గురై, ఆపై హింసను అనుభవించి తప్పించుకున్న ఓ యాజిదీ మహిళ చెప్పిన వివరాల ప్రకారం సెక్స్ బానిసలను ఎలా అమ్ముతున్నారో చూడండి.

యజీదీ వర్గానికి చెందిన మహిళలను, పిల్లలను ఉగ్రవాదులు బంధించి, వాళ్లను సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 3వేల మంది మహిళలు, బాలికలను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారి ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రాం లాంటి యాప్ల సాయం తీసుకుంటున్నారు. వాళ్ల ఫొటోలతో పాటు, ‘యజమానుల’ వివరాలు కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ తమ సొంత చెక్పోస్టులు పెట్టి, వాటి నుంచి మహిళలు తప్పించుకోకుండా చూస్తున్నారు. బందీలుగా ఉన్న మహిళలను తప్పించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించగా, వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.

అరబ్, కుర్దిష్ స్మగ్లర్లు మాత్రం ఎలాగోలా ప్రాణాలకు తెగించి నెలకు దాదాపు 134 మంది మహిళలను విడిపించారు. కానీ మే నెలలో ఐఎస్ ఉగ్రవాదులు వాళ్ల మీద విరుచుకుపడటంతో.. గత ఆరు వారాల్లో కేవలం 39 మందిని మాత్రమే విడిపించగలిగారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేసినా.. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మందుపాతరలను ఏర్పాటుచేయడంతో వాళ్లలో చాలామంది చనిపోతున్నారు. వాటి బారి నుంచి అతి కొద్ది మంది మాత్రం ఎలాగోలా తప్పించుకుని బయట పడుతున్నారు. విస్తూపోయే ఈ విషయాలు వెలుగులోకి రావటంతో ఈ విషయంలో కలగజేసుకోవాలని ఐరాసను పలు దేశాలు కోరుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Sex Slaces  Siria  Yazidi  

Other Articles