మాజీ డాన్ ఎంజాయ్ మెంట్ ఓ లుక్కేసుకోండి | Pictures Prove Abu Salem's Enjoying Life With Wife

Pictures prove abu salem s enjoying life with wife

Abu Salem marriage with Sayyed Bahaar Kausa, Abu Salem enjoyed Rail Coaches and waiting halls,

Underworld don Abu Salem living it up on train journeys for court hearings to Delhi and Lucknow has given the police an opportunity to open their investigation, which had hit a wall, into reports of the gangster's marriage with Mumbra resident Sayyed Bahaar Kausar.

జైల్లో ఉన్న డాన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి

Posted: 07/05/2016 02:49 PM IST
Pictures prove abu salem s enjoying life with wife

ఇండియాను షేక్ చేసిన ఓ పెద్ద గ్యాంగ్ స్టర్. కానీ పాపాలు పండి చేసిన నేరాలకు చివరకు పోలీసులకు చిక్కిపోయాడు. అయితేనేం, ఆయనగారిది నేరం చేయకముందు ఎలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేశాడో, చిక్కాక కూడా దాదాపు అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఎవరో కాదు... అబూ సలేం. ఇది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు... ప్రస్తుతం ఎక్కడున్నాడు? అదేం ప్రశ్న! అరెస్టయి ముంబై తలోజా జైల్లో రెస్ట్ తీసుకుంటున్నాడనేగా మీ సమాధానం. కానీ, ఓ సారి ఆయన లైఫ్ ఎలా ఉందో చూడండి.

విచారణల కోసం తరచూ లక్నో, ఢిల్లీ కి వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వేస్టేషన్లలోని వెయిటింగ్ రూంల్లో తన భార్యతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ముంబై కి చెందిన ఓ ప్రముఖ పత్రిక ప్రచురించడంతో కలకలం రేగింది. అబూసలేంను తాను ప్రేమించుకున్నామని, తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని ముంబైకి చెందిన కౌసర్ అనే 26 ఏళ్ల యువతి అప్పట్లో కోర్టును కోరింది. అయితే అభ్యర్థన అలాగే ఉండగా, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో రైలులో వీరి పెళ్లి అయిపోయిన్లు కథనాలు వెలువడ్డాయి. 2014 లో దీనిపై విచారణ జరుగగా, పోలీసులు మాత్రం అదంతా ఉత్తదేనని ఖండిస్తూ కేసును మూసివేశారు.

కానీ, ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ఫోటోలు చూస్తే అది నిజమే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రైలు బోగీల్లో, వెయిటింగ్ హాళ్లలో కౌసర్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారి పెళ్లిని ధృవీకరిస్తున్నాయి. అబూసలేం కౌసర్ తోపాటు మరికొందరు కుటుంబ సభ్యులను కూడా కలుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటోలను కూడా పత్రిక విడుదల చేసింది. పోలీసులు ఈ ఫోటోలు పాతవని, ఆ కథనాలన్నీ పచ్చి అబద్ధాలని పోలీసులు చెబుతున్నారు. అన్నట్లు గతంలో తలోజా జైల్లో ఈ మాజీ డాన్ కు సకల రాజభోగాలు కల్పిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పడు ఇలా... ఏదేమైనా ఆయనగారి లైఫ్ అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ కేకే అంటు సెటైర్లు పేలుస్తున్నారు కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abu Salem  Wife  Sayyed Bahaar Kausa  

Other Articles