టెంపుల్ రన్ లో నాని ఎపిసోడ్ హైలెట్ | kesineni Nani over action reason for chaos

Kesineni nani over action reason for temple demolition chaos

kesineni Nani warned, Chandra babu warning to kesineni nani, Kesineni Nani over action temple demolition

kesineni Nani over action reason for chaos in temple demolitions in vijayawada.

టెంపుల్ రన్ లో నాని ఎపిసోడ్ హైలెట్

Posted: 07/05/2016 02:01 PM IST
Kesineni nani over action reason for temple demolition chaos

సున్నితమైన అంశాన్ని కదిలించడం ద్వారా ఏపీ అధికార పక్షం తెలుగు దేశం తీవ్ర ఇరకాటంలో పడింది. రాజకీయ రాజధాని విజయవాడలో 45 దేవాలయాల కూల్చివేత వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల అత్యుత్సాహంతో టీడీపీ మిత్ర పక్షం బీజేపీలు కొట్టేసుకోవటంతో సమస్య మరింత జఠిలంగా మారింది. కూల్చివేతలపై సంఘ్‌ రంగంలోకి దిగడం, వందల సంఖ్యలో స్వాములు రోడ్డుమీదకొచ్చి ధర్నాలు, నిరసనలతోపాటు నేతలపై విమర్శలు చేయటం తెలిసిందే. దీంతో పరిస్థితి చెయ్యి జారక ముందే అలర్టయిన సీఎం చంద్రబాబు మంత్రులను రంగంలోకి దించారు.

స్వాములతో సమావేశం అయి పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు, కూల్చివేతలు ఇకపై ఉండబోవని, పడగొట్టిన వాటి స్థానే కొత్తవి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గుజరాత్‌లో దేవాలయాల కూల్చివేత ప్రస్తావనతోపాటు, గోకరాజుపై నాని చేసిన వ్యాఖ్యలే ఈ దుమారం రేగటానికి ముఖ్య కారణం అయ్యాయి. దానికి ప్రతిగానే స్వాములు, బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ టికెట్లు అమ్ముకుని ఎంపీ అయ్యాడంటూ శివస్వామి కేశినేని నాని పై ఫైర్ అవ్వటం, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు నాని చేసిన విమర్శలు హైలెట్ కావటంతో చంద్రబాబుకి తలనొప్పి మొదలైంది.

ఒకానోక టైంలో చంద్రబాబు జోక్యంతో శాంతించినప్పటికీ నాని క్షమాపణలు చెబితేనే తాము శాంతిస్తామని చెప్పటంతో ఎంపీపై ఏ రేంజ్ లో కోపంతో ఉన్నారో అర్థమౌతోంది. దీంతో సమస్యలకు మూల కారణం అయిన నానిని, ఎమ్మెల్సీ బుధ్ధాలను తన వద్దకు పిలిపించుకుని మరీ క్తాస్ పీకాడంట. ముఖ్యంగా నాని మీడియాలో ప్రముఖంగా రావడంతో పై బాబు ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఈ విషయంలో నాని చేసిన అతి దీనంతటికి కారణమని, భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

వ్యక్తిగత విభేదాల వల్లే సమస్యను పెద్దది చేశారని, మిత్రపక్షం నుంచి విమర్శల దాడి పెరగడానికి కారణమయ్యారని ఫైరయ్యారు. ఎవరిష్టానికి వారు ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తుంటే సహించబోనని హెచ్చరించారని తెలుస్తోంది. వెంటనే స్థానికులను శాంతింపజేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారంట. ఆలయాల తొలగింపు కంటే బెజవాడ ఎంపీ చేసిన ఓవరాయాక్షనే ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణమని స్పష్టమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  MP Kesineni Nani  Temple demolitions  Chandra babu  

Other Articles