Kavitha Stuns TANA organisers and telanganites

Telugus in us inspiration to many says mp kavitha

Telangana, TRS, Kavitha, Jai Telangana, Jai Andhra, jai Telangana, Jai Hind, Chicago

Daughter of Telangana crusader KCR and MP from hardocre Telangana TRS party, Kalvakuntla Kavitha, has surprised one and all by uttering 'Jai Andhra'.

ITEMVIDEOS: అగ్రరాజ్యంలో ఎంపీ కవిత ఆసక్తికర నినాదం..

Posted: 07/04/2016 09:52 AM IST
Telugus in us inspiration to many says mp kavitha

టీఆర్ఎస్ పార్టీ అవిర్భవించిన నాటి నుంచి ఏడాది క్రితం ఓటుకు నోటు కేసు వెలుగుచూసే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలకు నచ్చని ఓకే ఒక పదం జై ఆంధ్ర. ప్రాంతీయ విద్వేషాలు తారాస్థాయికి చెందిన సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గా సాగిన జై అంధ్ర ఉద్యమాన్ని అప్పట్లో తెలంగాణ నేతలు జీర్ణించుకోలేదు. ఆంద్ర అన్న పదాన్నే నిషేధిత పదంలా చూశారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం తెలంగాణ నేతల తెలుగు ఐక్యతకు నడుంబిగించుకున్నట్లుగా కనబడుతున్నారు.

ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో పక్క రాష్ట్రాలవారితో ఊరికే లోల్లి పెట్టుకోవడం ఎందుకంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఇటీవల కేటీఆర్ చంద్రబాబుకు సన్నాయి  నోక్కుల ట్విట్ చేయడం కూడా అసక్తి కరంగా మారింది. తాజాగా కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటారా.. అగ్రరాజ్యం అమెరికాలోని చికాగోలో తానా నిర్వహించిన తెలుగు మహాసభల రజతోత్సవ వేడుకలకు హాజరైన కవిత కూడా అలాంటి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటేనన్నారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు. జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ తన ప్రసంగాన్ని ముగించి అందరనీ ఆశ్చర్యంలో ముంచారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TRS  Kavitha  Jai Telangana  Jai Andhra  jai Telangana  Jai Hind  Chicago  

Other Articles