'TDP men have no right to obstruct BJP leaders'

Bjp tdp tussle over temple demolitions

Vijayawada, BJP-TDP tussle, BJP leaders, BJP Mlcs Kanna lakshmi narayan, somu veeraju,Telangana BJP, Telangana TDP, Temple Demolitions, Krishna Pushkaralu

The turf war between the TDP and BJP has once again come to the fore on Sunday when the latter’s vociferous leaders Somu Veerraju and Kanna Lakshminarayana protested against the demolition of temples in Vijayawada

ITEMVIDEOS: ఆలయ కూల్చివేతతో మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అంతరం..

Posted: 07/04/2016 11:09 AM IST
Bjp tdp tussle over temple demolitions

విజయవాడలో ఆలయ కూల్చివేత విషయంలో మిత్రపక్షాల మధ్య వివాదాలు రానురాను రాజుకుంటుంది. ఏకంగా ప్రత్యక్ష బౌతిక దాడులకు పాల్పడేందుకు కూడా సిద్దమవుతున్నారు. బెజవాడలో బీజేపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఒక దశలో ఇరువర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. పెద్దపెద్దగా కేకలు వేసుకోసాగారు. పరిస్థితి చెయ్యిదాటిపోతోందని గమనించిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడ్నుంచి పంపివేశారు.  మీ సంగతి తేలుస్తాం. ఇక్కడికి రావడానికి మీరెవరంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నడుమ పెద్ద వాగ్వాదమే నడిచింది.

విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన దేవాలయాలను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు పరిశీలించారు. చివరగా అర్జున వీధిలోని గోశాల వద్దకు చేరుకుని అక్కడ జరిగిన ధ్వంసాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడసాగారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడే సమయంలో టీడీపీ నేతలు వచ్చి అడ్డుకున్నారు. గోశాల ఎదురుగానే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇళ్లు ఉండడంతో ఆయన తన అనుచరులతో అక్కడికి వచ్చి సోము వీర్రాజు నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని తన వాదన వినిపించబోయారు.

తమ అభిప్రాయాలు చెప్పేందుకు ప్రెస్‌మీట్ పెట్టుకుంటే దాన్నెలా అడ్డుకుంటారంటూ వీర్రాజు, కన్నా  ప్రశ్నించారు. ఈలోగా  బీజేపీ నేతల వెనుక ఉన్న కార్యకర్తలను వెంకన్న వెంట వచ్చిన కార్యకర్తలు తోసివేశారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రెస్‌మీట్ అక్కడ నిర్వహించకూడదంటూ మైక్‌లు లాగేయబోయారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. బుద్దా వెంకన్న బంధువు, మాజీ కార్పొరేటర్ సంపర రాంబాబుల  మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలు నాయకులకు అడ్డుగా నిలబడి ప్రెస్‌మీట్  కొనసాగించాలంటూ పట్టుబట్టారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  BJP-TDP tussle  BJP leaders  BJP Mlcs Kanna lakshmi narayan  somu veeraju  

Other Articles