New Philippines President Rodrigo Duterte Wastes No Time Attacking Online Gambling

Suspected drug dealers killed in manila amid duterte crackdown

livecasinos, legislation, famous players, manila, president, rodrigo duterte, drug, photo, philippines, online, office, Philippines president, cabinet, internet, addict, palace, gambler, crime, casino, drug dealers, drug addicters

Philippines President Rodrigo Duterte was sworn into the country’s highest office on June 30, and the unconventional politician wasted no time in setting the tone for his administration.

మళ్లీ అవే విస్సోటక వ్యాఖ్యలు.. అన్ లైన్ గాంబ్లింగ్ పైనా..

Posted: 07/04/2016 09:09 AM IST
Suspected drug dealers killed in manila amid duterte crackdown

ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే దేశంలో మార్పు తీసుకురావాలని నిశ్చయించకున్నారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలిచిన వెంటే ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ ప్రజలను విస్మయానికి గురిచేశాయి. అయితే ఆయన మరోమారు కూడా అవే విస్పోటక వ్యాఖ్యలు చేశారు. దేశాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజున కూడా మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన బాధ్యతలు స్వీకరించగానే డగ్ర్స్ తో పాటు మరో అన్ని విధాల గాంబ్లింగ్ పైనా చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.

డ్రగ్ డీలర్లనే కాదు, వాటికి బానిసలైన వారిని కూడా కనిపిస్తే కాల్చేయండి. మీపై ఏ కేసూ లేకుండా చూసుకుంటా. ప్రక్షాళనకు ఏకైక మార్గం మారణకాండే. ఓ లక్షమందినైనా చంపించేస్తా. వారి శవాల్ని చేపలకు ఆహారంగా మనీలా అఖాతంలో పాతరేయిస్తా. మంచి లాభాలు కళ్లజూడాలనుకునేవారు శ్మశానవాటికల వ్యాపారం పెట్టుకోండి. బ్రహ్మాండంగా సాగుతుంది. నాదీ హామీ!’’ అని వ్యాఖ్యానించిన అధ్యక్షుడు తాజగా తన ఫిలిఫీన్స్ దేశంలో అన్ లైన్ గాంబ్లింగ్పైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బాగంగా లైవ్ కాసినోలపై డేగ కన్ను వేయనున్నారు. ఇక అవినీతి పోలీసుల అధికారులను కూడా సరండర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని శాఖల్లోనూ అవినీతి పెచ్చరిల్లింది. దీన్ని ఇకపై సహించను. ఎవరైనా సరే, తాట తీస్తా’ అని హెచ్చరించారు.

ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఫిలిప్పైన్‌వాసులు మాత్రం దుతర్తే అంటే పడిచస్తుంటారు. మే 9నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 60 లక్షల పై చిలుకు భారీ మెజారిటీతో ఆయనను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దుతర్తే సొంత పట్టణం దవావోలోని జనం బట్టల దగ్గరి నుంచి నడిపే వాహనాల దాకా అన్నింటిపైనా దుతర్తే ఫొటోలే! 71 ఏళ్ల దుతర్తే, ఫిలిప్పీన్స్ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అత్యంత పెద్ద వయస్కుడు. కానీ రూపంలో గానీ, మాటల్లో గానీ, చివరికి చేతల్లో గానీ ఆ వయోభారం మచ్చుకైనా కనిపించక పోవడం గమనార్హం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippines President  Drug mafia  Duterte  Online dating  

Other Articles