Shooting in Vienna supermarket, gunman shot down

Shooting in vienna supermarket gunman shot down

Vienna supermarket, gunman shot down, schonbrunn palace, BILLA supermarket, supermarket chain, shooting, gunman, shot down, Billa, Austria, commando unit, latest news, world news,

A gunman opened fire at a supermarket in Austria's Vienna. This prompted an emergency reaction from commando unit of the local police force, who shot the gunman down.

వియన్నా సూపర్ మార్కెట్లో కాల్పుల కలకలం.

Posted: 07/03/2016 08:32 AM IST
Shooting in vienna supermarket gunman shot down

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన నరమేథం విషాధ ఛాయల నుంచి ఇంకా కోలుకోక ముందే మరోమారు అలాంటి వార్తలే ప్రపంచాన్ని విషాదంలో ముందెత్తాయి. తాజాగా, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ సూపర్ మార్కెట్లోకి చొరబడ్డ సాయుధుడు కాల్పులు ప్రారంభించడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వేగంగా స్పందించారు. రంగంలోకి దిగిన పోలీసు కమాండోలు అతడిని మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.

అయితే, ఈ కాల్పులు జరిపిన వ్యక్తికి ఏదైనా ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నాయా లేవా అనే విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసుల వివరాల ప్రకారం బిల్లా సూపర్ మార్కెట్ పై శనివారం రాత్రి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నరమేధం సృష్టిస్తున్న నేపథ్యంలో కాల్పుల గురించి తెలియగానే పోలీసులు రావడమే కాకుండా ప్రత్యేక కమాండోలు హెలికాప్టర్లలో సంఘటన స్థలానికి వచ్చి వేగంగా స్పందించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shooting  Vienna supermarket  gunman  shot down  billa supermarket  Austria  

Other Articles