విశాఖ వాసుల కోసం వెరైటీ థియేటర్లు, ఎలాగంటే... | Drive-in theater ready in Vizag

Drive in theater ready in vizag

Drive-in theater in AP, Vizag Drive-in theater, open theater in vishakapatnam

Drive-in theater ready in Vizag

విశాఖ వాసుల కోసం వెరైటీ థియేటర్లు, ఎలాగంటే...

Posted: 06/27/2016 05:17 PM IST
Drive in theater ready in vizag

సినిమా చూడాలంటే క్యూలో నిలబడో లేక ఆన్ లైన్లో బుక్ చేసుకునో వెళ్తాం. తీరా థియేటర్లకు వెళ్లాక జనాలను తోసుకుంటూ ఆ గుంపులో వెళ్లి మరీ సినిమా చూస్తాం. ఇక ఇంటర్వెల్ లో టైం పాస్ పాప్ కార్న్ కోసమో, కూల్ డ్రింక్ కోసమో, మళ్లీ ఊస్సురుమనుకుంటూ నెట్టూకుంటూ వెళ్లాల్సిందే. ఇలా... విసిగి వేసారి ఉన్న వైజాగ్ వాసుల కోసం కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుంది.

డ్రైవ్ ఇన్ థియేటర్... పేరు కొత్తగా ఉన్నప్పటికీ ఇది మనకూ తెలిసిందే. కేవలం సాయంత్రం వేళలో ప్రద్శించే ఈ థియేటర్లను చాలా సినిమాల్లో కూడా వీటిని చూపించారు కూడా. ఓపెన్ థియేటర్లు ఉండి, కార్లలో వచ్చే ఫ్యామిలీస్, కపుల్ అందులోనే ఉండి సినిమాలను అలాగే వీక్షిస్తుంటాయి. ప్రస్తుతం ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా లలో ఉన్న దీనిని త్వరలో విశాఖలో ప్రారంభించబోతున్నారు.

దాదాపు ఐదు కోట్ల వ్యయంతో షీలానగర్ వద్ద ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ పేరుతో దీనిని నిర్మించారు. 90 వెడల్పు, 40 అడుగుల ఎత్తులో ఉండే స్క్రీన్ పై సినిమా చూసేందుకు ఒకేసారి 100 కార్లకు సరిపడా స్థలం ఉంటుంది. స్క్రీన్ అల్లంత దూరాన ఉన్నప్పటికీ సౌండ్ వినేందుకు వీలుగా కారులోని ప్లేయర్ లేదా ఎఫ్ ఎమ్ కి అనుసంధానం చేస్తారు. వీటితోపాటు స్పోర్ట్స్, ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. 90 శాతం పూర్తయిన దీనిని త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు ఓపెన్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drive-in theater  Vizag  STBL cine world  

Other Articles