నోరుమూసుకోవయ్యా స్వామీ..! | Subramanian Swamy has privately warned by BJP

Subramanian swamy has privately warned by bjp

Controversial BJP leader Subramanian Swamy, Subramanian Swamy zip up, Subramanian Swamy warned by BJP, BJP warns subramanian swamy

Controversial BJP leader Subramanian Swamy has privately been warned to "zip up" after a volley of attacks seen as targeting Finance Minister Arun Jaitley, said sources in the party today.

నోరుమూసుకోవయ్యా స్వామీ..!

Posted: 06/27/2016 04:16 PM IST
Subramanian swamy has privately warned by bjp

బీజేపీలో సుబ్రహ్మణ్య స్వామీ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాల పని పడతారని పనిమాల ఆయనకు రాజ్యసభ సీటు అప్పజెప్పితే ఏకంగా సొంత నేతలపైనే ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నాడు. ఆయన దెబ్బకు ఆర్థికమంత్రి జైట్లీ అర్ధంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ తిరిగి రావాల్సి వచ్చింది. తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న స్వామి తీరుతో జైట్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన భేటీలో కూడా జైట్లీ స్వామి ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. ఆయనను నిలువరించేలా చూడాలని జైట్లీ ప్రధానిని కోరాడంట. మరోవైపు స్వామిపై వ్యవహారశైలిపై అధినాయకత్వం చాలా గుర్రుగా ఉంది. తనకు సంబంధం లేని విషయాల్లో కలుగజేసుకోవద్దని కాస్త ఘాటుగా సూచించినట్టు తెలిసింది.

ఆయనిక తన నోటికి తాళం వేయాలని హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత రఘురాం రాజన్ ను, ఆపై అరవింద్ సుబ్రమణియన్ ను ఆయన లక్ష్యంగా చేసుకోగా, అవి పరోక్షంగా ఆర్థిక మంత్రి జైట్లీపై గురి పెట్టినట్టు కనిపిస్తున్నాయి. అయితే స్వామి ఆరోపణలపై ఇచ్చిన వివరణను మాత్రం పార్టీ బయటికి వెళ్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  BJP  zip up  

Other Articles