కేసీఆర్ కు 1500 కోట్లు టోకరా!| 1500 crores revenue income not paid by telangana builders

1500 crores revenue income not paid by telangana builders

telangana builders, KCR buildres, 1500 crores revenue income, telangana govt news

Builders almost not paying 1500 crores for telangana government.

కేసీఆర్ కు 1500 కోట్లు టోకరా!

Posted: 06/24/2016 08:58 AM IST
1500 crores revenue income not paid by telangana builders

ఓవైపు ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణకు అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్నది ప్ర్యతేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భోళా శంకరుడిని మించే స్థాయిలో వరాలు ఇచ్చుకుంటున్న సీఎం కేసీఆర్ ఆదాయం రాబట్టంలో మాత్రం వెనుకబడే ఉన్నారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. తెలంగాణ ప్రభుత్వం ఆలసత్వాన్ని అలుసుగా తీసుకుని తాజాగా 1500 కోట్ల రూపాయలుకు పంగనామం పెట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు బిల్డర్లు హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్లు ప్రారంభించారు. వాణిజ్య, నివాస ప్రాజెక్టులపై 5 శాతం షేర్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, వ్యాట్ తదితర రూపాల్లో బిల్డర్లు ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించాల్సి ఉంది. అలాగే ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం రూపంలో ఏపీహెచ్‌బీకి సొమ్ము చెల్లించాల్సి ఉంది. అయితే సంవత్సరాల తరబడి ఈ విషయం పెండింగ్‌లో ఉంది. అయితే ఆ తర్వాత బిల్డర్లు ఆ విషయాన్ని గాలికొదిలేసి చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగవేశారు.

కేవలం 9 మంది బిల్డర్లే ప్రభుత్వానికి దాదాపు 600 కోట్ల వరకు చెల్లించాల్సింది వుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో కళ్లు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం బిల్డర్ల నుంచి బకాయి సొమ్మును ఎలా రాబట్టాలన్న విషయంపై ఓ కేబినెట్ సబ్ కమిటీ వేసింది. కమిటీ సూచనల ప్రకారం బకాయి సొమ్మును రాబట్టనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  builders  united AP  revenue  

Other Articles