సోనియా అభ్యంతరకర ఫోటోతో ఒకరు మృతి | sonia gandhi whatsapp photo kills one in jabalpur

Sonia gamdhi whatsapp photo kills one in jabalpur

Sonia Gandhi, objectionable caricature, WhatsApp group, Madhya Pradesh’s Jabalpur, సోనియాగాంధీ వాట్సాప్ ఫోటో, సోనియాగాంధీ అభ్యంతరకర, వాట్సాప్ లో సోనియా ఫోటో, తెలుగు వార్తలు

A fight over an objectionable caricature of Congress president Sonia Gandhi in a WhatsApp group turned into a full-blown battleon the streets of Madhya Pradesh’s Jabalpur overnight, leaving a Congress worker dead and five others injured.

సోనియా అభ్యంతరకర ఫోటోతో ఒకరు బలి

Posted: 06/17/2016 10:17 AM IST
Sonia gamdhi whatsapp photo kills one in jabalpur

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభ్యంతకర ఫోటో ఒకటి వాట్సాప్ గ్రూప్ లో హల్ చల్ చేయగా, చెలరేగిన ఘర్షణలో ఒకరు చనిపోయారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని విజయ్ నగర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఘర్షణలో ఆరుగుర్ని గాయపడట్లు జబల్పూర్ సిటీ ఏరియా ఎస్పీ ఇంద్రజీత్ బల్సావర్ తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ 'విజయ నగర్ ఫ్రెండ్స్' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటో ఒకటి పోస్టు చేశాడు.

ఆమె పాత్రలు తోముతున్నట్లున్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్టు చేసి, 'సోనియాకు ఈ దుస్థితికి రావడానికి మోదీ కారణం' అన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యను జత చేశాడు. దీంతో జతిన్ రాజ్ కు కోపం వచ్చింది. గత రాత్రి అహింసా చౌక్ లో వీరు తమ అనుచరులతో కలుసుకుని వాదించుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు, ఇరు వర్గాలను స్టేషన్ కు పిలిచారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇరు వర్గాలు అక్కడ కూడా వాదులాటకు దిగాయి. ఇది తీవ్ర రూపం దాల్చడంతో దాడులకు పాల్పడ్డారు.

అయితే, ఈ ఘటన స్టేషన్ బయట జరిగిందని ఎస్పీ చెప్పారు. 'కాదు స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే జరిగింద'ని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి అసలేం జరిగిందో విచారణ జరిపాకే చర్యలు తీసుకుంటామని ఇంద్రజీత్ తెలిపారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles