Jo Cox murder Suspect linked to hard-right group that has campaigned against the EU

Rising british labour party mp jo cox was shot and killed

Jo Cox dead, Jo Cox, Apartheid, South Africa, Labour MP Jo Cox, law maker JO Cox, Britain, European Union, Thomas mair, Springbok Club, South Africa. Britain MP shot and stabbed,

The man arrested over the killing of Labour MP Jo Cox is believed to have had long-term links with a hard-right group based in London

పట్టపగలు పార్లమెంటు సభ్యురాలిపై కాల్పుల, హత్య

Posted: 06/17/2016 09:13 AM IST
Rising british labour party mp jo cox was shot and killed

బ్రిటన్‌లో దారుణం జరిగింది. యూరోపిన్ యూనియన్ బ్రిటెన్ లోనే వుండాలని బలండా విశ్వసిస్తూ, వాదించే ఓ ప్రముఖ మహిళా పార్లమెంటు సభ్యురాలని అమెకు సన్నిహితుడైన వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బ్రిటెన్ ప్రజాప్రతినిధి జో కాక్స్‌ను ఆమె నియోజకవర్గంలోనే ధామస్ మెయిర్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. అమెను ముందుగా తుపాకీతో కాల్చిన దుండగుడు ఆ తరువాత అతని కోపం అణగదోక్కకోలేకపోయాడు. అంతే తన వద్దనున్న కత్తితో అమెను విచక్షణరహితంగా దాడిచేసి హతమార్చాడు. ఆపై తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపాడు.

లేబర్ పార్టీ తరఫున వెస్ట్ యార్క్‌షైర్‌ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆమె బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోనే కొనసాగాలన్న వాదానికి గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ చర్యను అది నుంచి వ్యతిరేకిస్తున్న అమె సన్నిహుతుడైన థామస్ మెయిర్ ఆమెను హతమార్చాలని పథకం రచించుకున్నాడు. క్రితం రోజున మిట్టమధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బిర్‌స్టాల్‌ పట్టణంలో ఆమె కార్యాలయానికి చేరుకున్న దుండగుడు అక్కడే మాటువేశాడు.

ఆ తరువాత తన కార్యాలయానికి వచ్చిన ఎంపీని గమనించిన దుండగుడు.. జో కాక్స్ పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 41 ఏళ్ల కాక్స్‌ సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. వెంటనే ఆమెను విమానంలో లీడ్స్‌ జనరల్ ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఆమె హత్యకు కారణాలు ఏమిటన్న దానిపై ఇప్పుడు వెల్లడించలేమని, ఆమెపై దాడికి కారణమైన ఘటనలో నిందితుడిని అరెస్టుచేశామని వెస్ట్ యార్క్‌షైర్‌ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్‌ తెలిపారు. కాగా ఎంపీ హత్య బ్రిటన్‌ రాజకీయ వర్గాలను షాక్‌ కు గురిచేస్తున్నది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Britian. MP murder  parlamentarian  Jo Cox  British lawmaker shot dead  EU  

Other Articles