Here's Proof That Indians Are Bollywood Buffs

Indians are movie buffs even google agrees

Videos, bollywood, Tollywood, technology, music, Movies, India, Google India, Google, Delhi, Cricket

Google has developed more in-depth search results for queries related to Indian cinema, mirroring what it did during the cricket world cup, as the search giant continues to invest in the Indian market.

సెర్చ్ ఇంజన్ లో మనవాళ్లు దేనిని ఎక్కువగా వెతుకుతున్నారో తెలుసా..?

Posted: 06/17/2016 10:15 AM IST
Indians are movie buffs even google agrees

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ లో మనవాళ్లు ఎక్కువగా దేని గురించి వెతుకుతున్నారో తెలుసా..? భారతీయులు గూగుల్ని అత్యధికంగా దేని గురించి అడుగుతున్నారో తెలిస్తే.. మీరు కూడా వెతకడం ప్రారంభిస్తారు.  అదేంటి అనుకోకండి.. మన దేశంలోని ఇతిహాసాలు, ప్రముఖులు, పురాణాలు, చరిత్రక ఘటనలు, క్రీడలు, క్రీడాకారులు, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీతో పాటు ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకుంటున్న భారతీయులు.. అన్నింటికన్నా అధికంగా మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల గురించి వెతికేస్తున్నారట.

మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడే వినియోగదారులు గూగుల్లో వెతుకుతున్న ప్రతి 10 అంశాల్లో ఒకటి సినిమాలకు సంబంధించిన విషయమేనట. అందుకే సినిమా ప్రియులు మరింత సులభంగా వారి అభిమాన చిత్రాలు, తారలు, సంగీతాల గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ గూగుల్ కొత్త ఆప్షన్లను జోడించనుంది. ఇక నుంచి సినిమాల గురించి వెతికేవారికి సమాధానాలతో పాటు కరోజల్స్ రూపంలో ఆయా ప్రాంతాల్లో సినిమాల సమయాలు, సినిమాల గురించి సంక్షిప్త సమాచారం అందనుంది.

కాగా గూగుల్ సెర్చ్ లో సినిమాలకు సంబంధించిన సమాచారం గురించే వినియోగదారులు అత్యధికంగా వెతుకుతున్నట్లు తెలియడంతో ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గూగుల్ ఇండియా హెడ్ స్వప్నా చడ్డా తెలిపారు. భారతదేశ వినియోగదారుల్లో ఎక్కువమంది సినిమా గురించే అడుగుతున్నట్లుగా గూగుల్ కంపెనీ గమనించినట్లు ఆమె తెలిపారు. అయితే ఎంత శాతమో సంఖ్య సరిగా తెలపని ఆమె... ఇండియాలో పదిమందిలో ఒకరు సినిమాను గురించే శోధిస్తున్నట్లు వివరించారు.

సినిమాతోపాటు క్రికెట్ గురించిన సమాచారాన్ని, క్రీడాకారులకు సంబంధించిన వార్త విశేషాలపై కూడా భారత వాసులు అధికంగా శోధిస్తున్నట్లు చడ్డా తెలిపారు. భారత్ కు ఉత్పత్తులు అందించడంలో గూగుల్ కు సుదీర్థ చరిత్ర ఉందని, అందుకే లక్షలమంది ఇండియన్ సినిమా అభిమానులకు వారికిష్టమైన సినిమాలు, నటులు, సంగీతం, పాటలు గురించిన సమాచారం అందించి వారికి కావలసిన సంతోషాన్ని అందించాలని గూగుల్ నిర్థారించుకున్నట్లు చడ్డా తెలిపారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Videos  bollywood  Tollywood  technology  music  Movies  India  Google India  Google  Delhi  Cricket  

Other Articles