police arrests 12 youth for taking selfie with minor girl

Selfie with bathing girl at kodaikanal waterfalls

selfie with bathing girl, youth arrested for taking selfie, youth took selfie without girl concern, youth took selfie with bathing gril, kodaikanal girl selfie, youth arrested in girl selfie, girls parents thrashed for selfie, selfie, kodaikanal, kodaikanal waterfalls, youth arrested, police, crime

kodaikanal police arrests 12 men for taking selfie with bathing minor girl after thrashing her parents who objected them taking selfies

స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ..

Posted: 06/12/2016 10:34 AM IST
Selfie with bathing girl at kodaikanal waterfalls

టూరిస్టు కేంద్రమై కొడెకైనాల్‌ జలపాతం వద్ద చిన్నారి బాలికతో అసభ్యంగా వ్యవహరించిన 12 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు, కొడైకనాల్ జలపాతం వద్ద స్నానం చేస్తున్న 12 ఏళ్ల చిన్నారితో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దానిని అడ్డుకున్న బాలిక తల్లిదండ్రులతో వాదనకు దిగి వారిపై దాడికి కూడా పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చికి చెందిన ఓ కుటుంబం కొడెకైనాల్‌కు పర్యటనకు వచ్చారు. కుటుంబసభ్యులు అనుమతి మేరకు వారి 12 ఏళ్ల బాలిక జలపాతాలలో స్నానం చేస్తుంది.

అదే సమయంలో అక్కడికి వచ్చిన 12 మంది యువకులు బాలిక స్నానం చేయడాన్ని చూసి అమె వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించారు. బాలిక గట్టిగా అరవడంతో అమె తల్లిదండ్రులు వెంటనే అక్కడి చేరకుని యువకులను సెల్ఫీలను తీసుకోనియకుండా అడ్డుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులకు యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక క్రమంలో సహనం కోల్పోయిన యువకులు బాలిక తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. దీనిని గమనించిన పర్యటకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

సాన్నం చేస్తున్న చిన్నారి బాలికతో సెల్పీ దిగిన యువకులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని నాగర్‌కోవిల్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిపై సమాచారం అందుకున్న కొడెకైనాల్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలికలో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : selfie  kodaikanal  kodaikanal waterfalls  youth arrested  police  crime  

Other Articles