Wife busy watching TV as her husband charred to death

Wife watches tv as hubby burns to death

Wife watches TV as hubby burns to death, Wife glued to TV as man charred to death, kolkata wife, Ranjit Kumar Barat, Sutapa Barat, Manicktala government colony, lal bazar,

Firefighters shocked when they discovered a 57-year-old woman, covered in soot and kerosene, watching television while the charred body of her husband lay in the other room

భర్త సజీవదహనం.. పక్కగదిలో టీవీ చూస్తున్న భార్య

Posted: 06/12/2016 09:13 AM IST
Wife watches tv as hubby burns to death

భర్త, అయన తల్లిదండ్రులే భార్యకు కనిపించే దైవాలని నమ్మె సంస్కృతి మనది. అలాంటిది దశాబ్దాల కాలం పాటు కలసి సంసారం చేసిన తరువాత.. భర్తంటే తనను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు కావాలి. కానీ భర్తను ఓ వస్తువులా పరిగణించరాదు.మరీ ముఖ్యంగా ఉద్యగ విరమణ పోందిన తరువాత చాలా మంది భర్తలు తమ భార్యల చేతిలో పరాభవాల పాలు అవుతుంటారు. అయితే ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరీ దారుణంగా వుంది. భర్త ఓ వైపు మంటల్లో కాలిపోతూ ఉంటే.. తనకేమీ పట్టనట్లు తాపీగా టీవీ చూస్తూ గడిపిందో భార్య. అది కూడా పక్క గదిలోనే. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతాలోని మనిక్ తాలా గవర్నమెంట్‌కాలనీలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంజిత్ కుమార్ బరాత్ (63), సుతపా బరాత్ (57)లు భార్యా భర్తలు. సీఈఎస్సీ అధికారిగా పదవీ విరమణ చేసిన రంజిత్, తన భార్యతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. women మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి బెడ్ రూం గదిలో నుంచి దట్టమైన పొగలను చూసిన ఇరుగు, పొరుగు వారు పోలీసులకు, ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి భర్త ఓ గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండగా, మరో గదిలో లోపలివైపు నుంచి తలుపేసుకుని టీవీ చూస్తూ కూర్చుంది అతని భార్య.

తనను హత్య చేస్తాడన్న భయంతోనే గదిలో తలుపేసుకుని ఉన్నానని, గట్టిగా అరిచినా ఎవరూ రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు మాత్రం ఈ ఘటన వెనుక పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వారికి చెందిన మారుతి కారును కూడా పరిశీలించిన పోలీసులు ఈ ఘటన వెనుక కారణాలు మాత్రం వేరే వున్నాయని అనుమానిస్తున్నారు. తమ దర్యాప్తులో ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్న విషయం వెలుగులోకి వస్తుందని చెప్పారు. పోస్టుమార్టం తర్వానే రంజిత్ మరణం ఎలా సంభవించిందన్న విషయాన్ని తేలుస్తామని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kolkata wife  Ranjit Kumar Barat  Sutapa Barat  Manicktala government colony  lal bazar  Crime  

Other Articles