Arvind Kejriwal promises 1,000 more Mohalla clinics in Delhi by next year

Five city hospitals fined rs 600 crore for spurning the poor

arvind kejriwal, kejriwal mohalla clinic, aap mohalla clinic, mohalla clinic in delhi, 1000 mohalla clinic, aap medical college, aap promises, aap education, aap health, delhi news, aap news

Kejriwal also noted that his government was successful in building a medical college in a "record time" of one year.

అసుపత్రులపై కొరడా ఝులిపించిన ఆప్ సర్కార్..

Posted: 06/12/2016 11:07 AM IST
Five city hospitals fined rs 600 crore for spurning the poor

సామాన్యుల పార్టీగా అధికారంలోకి వచ్చిన అప్ ప్రభుత్వం ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి సంక్షేమానికి పెద్దపీట వేసింది. ముఖ్యంగా ప్రజలకు అత్యంత అవసరమైన సేవల రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. ఎంతలా అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజలకు మేలు చేసేంతగ. ఇచ్చిన హామీలను పాటించకుండా తప్పుడు త్రోవలో నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కొరడా ఝులిపించింది. ఐదు ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కోట్ల ఫైన్ విధించింది.

పేద రోగులకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వ భూముల్లో ఆస్పత్రులు నిర్మించుకుని అనంతరం మాట తప్పుతుండటంతో ఈ చర్యలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఉపక్రమించింది. ఇదే కండిషన్ పై అనుమతి పొందిన మరో 43 ఆస్పత్రుల పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫార్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇన్ స్టిట్యూట్, మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి(సాకేత్), శాంతి ముఖంద్ ఆస్పత్రి, ధర్మశాల క్యాన్సర్ ఆస్పత్రి, పుష్పావతి సింఘానియా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లపై ప్రభుత్వం ఈ ఫైన్ విధించింది.

ఈ ఆస్పత్రులన్నీ కూడా ప్రభుత్వ భూములను తక్కువ రేటుకే పొందాయి. 'ఈ ఆస్పత్రులన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుపరచడం లేదు. అందుకే మేం చర్యలు ప్రారంభించాం. వారు నిర్ణయించిన సమయంలోగా రూ.600కోట్లు ప్రభుత్వానికి జమచేయాలి. ఇది పేదలకోసం ఉపయోగిస్తాం. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటాం' అని ప్రభుత్వ అధికారి డాక్టర్ హేమ్ ప్రకాశ్ చెప్పారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new delhi  private hospitals  600 crore fine  aap government  aravind kejriwal  

Other Articles