డ్రాగన్ ప్రతీకారం మరీ ఇలానా? | china ultimate revenge on trump by making tissues

China ultimate revenge on trump by making tissues

china, china revenge on trump, toilet papers, Donald Trump china, తాజా వార్తలు, తెలుగు వార్తలు, డొనాల్డ్ ట్రంప్, టాయిలెట్ పేపర్లు, ట్రంప్ టాయిలెట్ టిష్యూ, latest news, telugu news, political news

china ultimate revenge on trump by making tissues. Chinese manufacturers are selling toilet papers in the US with facial expressions of the controversial presumptive.

డ్రాగన్ ప్రతీకారం మరీ ఇలానా?

Posted: 06/06/2016 03:46 PM IST
China ultimate revenge on trump by making tissues

వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆ వివాదాలే ఆయన్ను అమెరికన్ అధ్యక్ష బరి సీన్ లో బలంగా మార్చేస్తున్నాయి. సొంత దేశం సహా ఎవరినీ వదలని ఆయన భారత్, చైనాలు అక్కడి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయంటూ బహింరంగగానే ప్రకటన ఇచ్చారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అర్థిక వృద్ధికి ఈ రెండు దేశాల పౌరులే కృషి చేస్తున్నారన్న తోటి నేతల వ్యాఖ్యలతో ట్రంప్ కాస్త శాంతించాడు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు తాను ప్రెసిడెంట్ అయితే ఈ రెండు దేశాలతో వర్తక వాణిజ్యాలను కొనసాగిస్తానంటూ పేర్కొన్నాడు. ఈ విషయంపై భారత్ కూడా లైట్ తీస్కోంది. కానీ, చైనా మాత్రం ఇంకా మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోంటోంది.

ట్రంప్ చిత్రాలను ఏకంగా టాయిలెట్ టిష్యూ పేపర్లపై ముద్రించి అమ్మకాలు కొనసాగిస్తోంది. అయితే ఆ అమ్మాకాలు చైనాలో అనుకంటే పప్పులో కాలేసినట్లే.  'డంప్ విత్ ట్రంప్' అన్న స్లోగన్ తో చైనా తయారీ సంస్థలు టాయిలెట్ పేపర్ ను తయారు చేసి అమెరికా మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ఇక జనాలు కూడా పిచ్చక్రేజ్ తో వీటిని కొనేసుకుంటున్నారు. ట్రంప్ ఫేస్ ఎక్స్ ప్రెషన్లతో ఉన్న వివిధ రకాల మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయంట. నిజానికి ఈ అమ్మకాలను ఫిబ్రవరి నుంచి అంటే ట్రంప్ వ్యాఖ్యలు చేసిన వెనువెంటనే ప్రారంభించగా, ఇప్పుడు ఆ అమ్మకాలు ఇరవై రెట్లు పెరిగిందట. 5000 రోల్స్ తో కూడిన ఆర్డర్లు తమకు 50కి పైగా వచ్చాయని, వీటిల్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చాయని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. చైనా ఆన్ లైన్ బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ ఫాం, అలీబాబా మాధ్యమంగా, 70కి పైగా కంపెనీలు ఈ తరహా టాయిలెట్ పేపర్లను విక్రయిస్తున్నట్టు క్సిన్హువా పేర్కొంది. కాగా, హోల్ సేల్ ధరలో 50 సెంట్లు మాత్రమే ఖరీదయ్యే వీటి ధరలు, ఈబే, అమేజాన్ వరకు వచ్చేసరికి 30 డాలర్ల వరకూపలుకుతోందట. అది చైనా గ్రేట్ రివెంజ్ స్టోరీ.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  china revenge on trump  trump toilet papers  Donald Trump china  

Other Articles