నిఖిల్ రెడ్డి మ్యాటర్ లోకి టీ సర్కార్ | telangana medical council submit report on nikhilreddy issue

Telangana medical council submit report on nikhilreddy issue

nikhilreddy hight, global hospital surgery, telanagana medical council report, telangana govt nikhil reddy, నిఖిల్ రెడ్డి, గ్లోబల్ ఆస్పత్రి, శస్త్రచికిత్స, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, హైట్ సర్జరీ, తెలుగు వార్తలు, తెలంగాణ వార్తలు, రాజకీయాలు, తాజా వార్తలు, latest news, telugu news

telanagana medical council submit report on nikhilreddy issue. says that the doctors negligency cause for nikhil situation.

నిఖిల్ రెడ్డి మ్యాటర్ లోకి టీ సర్కార్

Posted: 06/06/2016 04:16 PM IST
Telangana medical council submit report on nikhilreddy issue

కాసుల కోసం కక్కుర్తిపడ్డ ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకంతో నిఖిల్ రెడ్డి అనే యువకుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. పొడవు పెరిగేందుకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా రెండు నెలల క్రితం ఆ యువకుడు హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే అలాంటిది సాధ్యం కాదని తెలిసి కూడా సర్జరీ పేరుతో ఆ యువకుడి జీవితాన్ని నాశనం చేసింది. రెండు కాళ్ల మధ్య రాడ్లలాంటివి అమర్చి కనీసం అతన్ని నడవలేని స్టేజీకి దిగజార్చింది. దీంతో హీరో నితిన్ లా మారదామనుకుని కలలు కన్న  ఆ యువకుడు ఉద్యోగం కోల్పోవటంతోపాటు పూర్తిగా వీల్ చైర్ కే అంకితమయిపోయాడు. విషయం మీడియా దృష్టికి చేరటంతో రెండు నెలల్లో బాగుచేస్తామంటూ హామీ ఇచ్చిన ఆస్పత్రి యాజమాన్యం ఆపై కిక్కురుమనకుండా ఉండిపోయింది.  దీనిపై యువకుడి తండ్రి న్యాయ పోరాటానికి సిద్ధమవగా, చివరికి ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి చేరింది.

దీనిపై పూర్తి విచారణ చేపట్టిన తెలంగా మెడికల్ కౌన్సిల్ సోమవారం పూర్తి నివేదికను వెలువరించింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ నిర్వహించారని అందులో పేర్కొంది. ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల మీద ఓ కన్నేసి ఉంచుతామని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి శస్త్రచికిత్సలకు పాల్పడితే ప్రభుత్వానికి సిఫారసు చేసి వాటిని మూయించేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం నిఖిల్ రెడ్డి పరిస్థితిని అతని తండ్రి ద్వారా సమీక్షిస్తున్నామని తెలిపింది. అవసరమైతే అతన్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతామని టీఎంసీ ప్రకటించింది. ఇక పూర్తి నివేదికను పరిశీలించి, సంబంధిత మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nikhilreddy hight  global hospital  telangana medical council  

Other Articles