అరబ్ షేక్ వెర్రి చూస్తే షాకవుతారు | arab sheikh spends 32 crores for fancy number

Arab sheikh spends 32 crores for fancy number

arab sheikh, UAE car registration, 32 crores for fancy number, 32 crores for 1 number, తాజా వార్తలు, తెలుగు వార్తలు, దుబాయ్, యూఏఈ కారు రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నంబర్ కోసం 32 కోట్లు, 1 కోసం 32 కోట్లు, dubai news, latest news

arab sheikh spends 32 crores for fancy number. this was the most costliest car redistration in world. Registration plate bearing just the number one fetched $4.9 million at auction in the United Arab Emirates, press reports said on Sunday.

అరబ్ షేక్ వెర్రి చూస్తే షాకవుతారు

Posted: 06/06/2016 03:44 PM IST
Arab sheikh spends 32 crores for fancy number

తమ జల్సాల కోసం డబ్బు వృథాగా ఖర్చుపెట్టే జనాలను ఎంతో మందిని మనం చూశాం. ఇంకోందరు తమకు ఇష్టమైన దానికోసం ఎంతైనా వెచ్చించేందుకు వెనకాడటం చూశాం. తమ సుఖం కోసం మనీని మంచినీళ్లలా ఖర్చుపెట్టి దాహం తీర్చేసుకున్న కథలు విన్నాం. కానీ, తనకు కావాల్సిన దానికోసం కోట్లు తగలేసిన వ్యక్తి బహుశా ఇతగాడేనేమో! ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంతదాకా సెలబ్రిటీలకే సొంతం అనుకున్న ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి ఇప్పుడు అందరికీ పాకేసింది. వీలైనంత స్తోమతను బట్టి వారి ఫేవరెట్ నంబర్ల కోసం మాములు జనాలు కూడా ఎగబడేయటం ఇప్పుడు జరుగుతోంది. అదే కోవలో ఇక్కడ ఓ అరబ్ షేక్ తనకు కావాల్సిందాని కోసం కోట్లు వెచ్చించాడు.

ఇంతకీ అతనికి కావల్సింది ఏంటో తెలుసా? 1. అవును ఒకటి అనే నంబర్ అంటే అతనికి విపరీతమైన మోజు అంట. అందుకోసం ఏకంగా 52.2 మిలియన్ దీరామ్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 32 కోట్లు ఖర్చుపెట్టాడు. ప్రస్తుతం యూఏఈలో ఫ్యాన్సీ నంబర్ల వేలంపాట నిర్వహిస్తున్నారు. దానికి హాజరైన అహ్మద్ అల్- జరౌనీ అనే వ్యాపారి హాజరయ్యాడు. ‘1’ నెంబర్ ఫ్లేట్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేశాడు. ఎ:దుకింతా అని అడిగిన మీడియాకు ‘‘ఎప్పుడూ నెంబర్ వన్ గా ఉండటమే నా లక్ష్యం అంటూ చివర్లో స్టేట్ మెంట్ ఇచ్చాడితగాడు. ప్రస్తుతం షార్జాలో తాను కోన్న కొత్తకారు కోసం ఈ నెంబర్ ను వేలంపాటలో కొన్నాడంట. ఇంతకీ ఆ కారు ఖరీదు ఎంతో తెలుసా? కేవలం 11 కోట్లు అంటే కారు కన్నా దాని నంబర్ కోసమే మూడురెట్టు ఖర్చు పెట్టాడన్నమాట. అన్నట్లు ఈ ఒక్క నంబర్ తోనే కాదు ‘12’, ‘22’, ‘50’, ‘100’, ‘777’, ‘1000’, ‘2016’, ‘2020’ నెంబర్లను వేలం వేసి నిర్వహణ సంస్థ ఏకంగా రూ.91 కోట్ల ఆదాయాన్ని వెనకేసుకుందట. కోరుకున్న నెంబర్ కోసం లక్షలు తగలేసేందుకు వెనుకాడని ప్రముఖులు ఉన్నారని మనకు తెలుసుగానీ మరీ ఇలా కోట్లు కుమ్మరించే కుబేరుడు ఉన్నాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో!

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles