బాడీ బిల్డర్ దిగ్గజం ఇకలేడు | India's first Mr Universe passes away

India s first mr universe passes away

India's first Mr Universe, Manohar Aich, first baody builder, తాజా వార్తలు, తెలుగు వార్తలు, మనోహర్ ఎయిచ్, ఉత్తర కోల్ కతా, మొదటి మిస్టర్ యూనివర్స్, latest news, entertainment

India's first Mr Universe passes away. Legendary Indian body builder and the country's very first Mr Universe Manohar Aich died on Sunday. He was 102. Aich breathed his last at his north Kolkata residence following age related health issues.

బాడీ బిల్డర్ దిగ్గజం ఇకలేడు

Posted: 06/06/2016 10:34 AM IST
India s first mr universe passes away

లెజెండరీ బాడీ బిల్డర్ మనోహర్ ఎయిచ్ (102) కన్నుమూశాడు. తీవ్ర అనారోగ్యంతో భాదపడుతన్న ఆయన ఆదివారం ఉదయం కోల్ కతాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్వతంత్ర బారతదేశం తరపున మిస్టర్ యూనివర్స్ గా గెలుపొందిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు.
 
కోమిల్లా జిల్లాలో (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ లో ఉంది) ఓ నిరుపేద కుటుంబంలో మనోహర్ జన్మించాడు. పాకెట్ హెర్ క్యూల్స్  అనే ముద్దు పేరుతో పిలవబడే ఈ బిల్డర్ దిగ్గజం కెరీర్ మొదట్లో ప్రముఖ మెజిషీయన్ పీసీ సర్కార్ చేసే షోలలో స్టంట్ లు నిర్వహించేవాడు.  ఆపై బ్రిటీష్ రాయ‌ల్ ఎయిర్ ఫోర్స్ లో చేరి 1942 నుంచి బాడీబిల్డింగ్ లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. 1952లో మిస్టర్ యూనివ‌ర్స్ గా గెలుపొందిన మ‌నోహ‌ర్ తర్వాత జరిగిన ఏషియ‌న్ గేమ్స్ లో మూడు బంగారు ప‌త‌కాలు సాధించారు. స్ర్పింగ్ పుల్లింగ్ విభాగంలోనూ ప్రపంచ ఛాంపియ‌న్ షిప్ విజేత‌గా నిలిచి రికార్డు సృష్టించారు. పేరుకే పెద్ద బాలీబిల్డర్ అయినప్పటికి ఆయన పెద్ద పొడగరి ఏం కాదు.  ఆయన హైట్ కేవలం 4 అడుగుల 11 అంగుళాలు మాత్రమే. ఇక ఆయన రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. 1991 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు

భాస్కర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MR UNIVERSE  Manohar Aich  first baody builder  

Other Articles