అపోలో అలాంటి పనులు చేస్తుందా? | apollo doctors hand in kidney rocket

Apollo doctors hand in kidney rocket

apollo, kidney rocket, apollo kidney rocket, senior hospital staff, తాజావార్తలు, అపోలో యాజమాన్యం, అపోలో కిడ్నీ దందా, కిడ్నీరాకెట్, తెలుగు వార్తలు, latest news, telugu news

apollo doctors hand in kidney rocket. Police had arrested the two, along with three alleged middlemen, Thursday. Both live in Badarpur and their houses are located within 3 km of each other. Sources said the nephrologist has gone abroad. Sailesh’s mother Sumanlata, alleged that the racket was being run by senior hospital staff. “I don’t know who is behind this but my son has been trapped by hospital staff. Their roles should also be investigated,” she alleged.

అపోలో అలాంటి పనులు చేస్తుందా?

Posted: 06/06/2016 10:56 AM IST
Apollo doctors hand in kidney rocket

ప్రముఖ ఆస్పత్రుల యాజమాన్యం అపోలోపై ఇప్పడు సంచలన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కిడ్నీ రాకెట్ల దందాలో అపోలో ఆస్పత్రికి సంబంధం ఉందని తెలియటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అక్రమ కిడ్నీల వ్యాపారం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా, అపోలో ఉన్నతాధికారుల హస్తం ఉందని తేలింది. ఇందులో ఇద్దరు అపోలో వైద్యులు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అయిన రాజ్‌కుమార్‌ రావు కోసం పోలీసులు కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో దాడులు జరిపారు..

రంగంలోకి దిగిన 25మందితో కూడిన సభ్యుల ప్రత్యేక టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క ఢిల్లీలోనే ఈ ముఠా ఐదు కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిసింది. దాదాపు రెండేండ్ల కాలంలో జలంధర్, కోయంబత్తూరు నగరాలలో 10 నుంచి 15 వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు పాల్పడిందని ఆగ్నేయ ఢిల్లీ డీఎస్పీ రంధవా చెబుతున్నారు. భారీగా డబ్బు ఆశచూపెట్టి ఆపై వారిని మోసం చేసేవారని తెలిసింది. అసలు దాతకు, స్వీకర్తకు ఎక్కడా కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్తగా వ్యవహరించేవారంట. 40 నుంచి 50 లక్షలు ఆఫర్ చేసి చివరికి దాతలకు నాలుగైదు లక్షలతో సరిపెట్టేవారంట.

ఇక ఈ కిడ్నీ రాకెట్ లో ఒక్క అపోలోనే కాకుండా మరికొన్ని ప్రముఖ ఆస్పత్రుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తునారు. భారత్‌తోపాటు విదేశాల్లో గత కొద్ది నెలల కాలంలో నిర్వహించిన కిడ్నీ శస్త్రచికిత్సల వివరాలను అందజేయాలని అపోలోతోపాటు నగరంలో ని ఐదు ప్రముఖ ఆస్పత్రులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. కాగా, అపోలో టాప్ డాక్టర్ల ప్రమేయం లేకుండా ఇంతపెద్ద దందా సాగించడం అసాధ్యమని నిందితుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆరోపణలు ఎదుర్కుంటున్న అపోలో డాక్లర్లను విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తామని అపోలో యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కిడ్నీల అక్రమ దందా ఎంతో ఆందోళనకర అంశమని, ఎటువంటి సమాచారం అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధమని అందులో పేర్కొంది. అయితే ఆరోపణలతో అరెస్టైన వైద్యుల గురించి మాట్లేందుకు అపోలో నిరాకరించింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apollo  kidney rocket  apollo kidney rocket  senior hospital staff  

Other Articles