At least three dead and 40 injured in Belgium train crash

Three dead and 40 injured in belgium train crash

Train crash in Namur, Train crash in Liege, Train crash in Belgium, Train crash, National Railway Company of Belgium, Train crash in saint Georges sue meuse, passenger trains hits goods train

A passenger train crashed into the back of a freight train in the eastern Belgian municipality of Saint-Georges-Sur-Meuse, killing three people and injuring 40, Belgian officials said.

ITEMVIDEOS: ఆగివున్న రైలును హైస్పీడుతో ఢీకొన్న మరో రైలు..

Posted: 06/06/2016 09:29 AM IST
Three dead and 40 injured in belgium train crash

బెల్జియంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును వెనక నుంచి అదే ట్రాక్ పై హై స్పీడ్ తో వచ్చిన ఓ ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పన్నెండు మంది ప్రయాణికులు ప్రాణాలుకోల్పోగా 40మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. బెల్జియంలోని తూర్ప ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాముర్-లెజ్జీ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచుసుకుంది.

సెయింట్ జార్జెస్ సుర్ మోస్సీ పురపాలక సంఘం పరిధిలో జరిగిన ఈ ఘటనతో అక్కడి మేయర్ హుటాహుటిన ఘటనాస్థలాన్ని పరిశీలించించారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, కూడా సంఘటనా స్థలానికి పంపామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల సహాయ చర్యలందించేందుకు గాను తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. అయితే ప్రమాదానికి ముందు ప్యాసింజర్ రైలు బ్రేక్ వేసే ప్రయత్నం చేసిందా..? లేదా..? అసలు ప్యాసింజర్ డ్రైవర్ గూడ్స్ రైలును చూడలేదా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

గూడ్స్ రైలును వెనకగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకోనడంతోనే ఈ ప్రమాదం సంబవించిందని రైల్వే అధికార ప్రతినిధి ఫ్రిడిరిక్ సాక్రే తెలిపారు, గూడ్సు రైలును ఢీకొనె సమయంలో ప్యాసింజర్ రైలు హై స్పీడ్ వేగంతో ఉందని, చాలా భయంకరంగా ప్రమాద దృశ్యం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక దర్యాప్తు తరువాత ప్రమాదానికి గల కారణాలను వెలువరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు ఢీకొన్న సమయంలో ఓ బాంబు పేలినంత పెద్ద శబ్దం వేసిందంటే ఎంత వేగంతో రైలు ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Belgium  Train crash  National Railway Company of Belgium  Namur  Liege  

Other Articles