tamil nadu voters change trends, jayalalithaa to hold cm seat for second time

West bengal voters vote for mamata bjp to open account with 7 seats

five state elections, exit polls, assam election, tamil nadu elections, west bengal elections, kerala elections, Narendra Modi, Oommen Chandy, Kerala, Left, tarun gogai, jaya lalithaa, karunanidhi, stalin, mamatha banarjee,

With the staggered elections in the states of Assam, West Bengal, Tamil Nadu, Kerala, and Puducherry now complete, psephologists have arrived on the scene with their poll predictions.

మమత, జయలకు మరోసారి సీఎం పగ్గాలు, అసోంలో బీజేపికి పగ్గాలు

Posted: 05/19/2016 10:13 AM IST
West bengal voters vote for mamata bjp to open account with 7 seats

తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం సహా కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరిలలో ఫలితాల సరళి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తమిళనాడు మినహా రమారమి అన్ని రాష్ట్రాలలో నిజమైయ్యాయి, ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా అసోంలో బీజేపి అధికార పగ్గాలను అందుకునేందుకు అక్కడి ప్రజలు తీర్పును ఇవ్వగా, పశ్చిమ బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ అంచాలకు మించి తృఫముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రెండో పర్యాయం పగ్గాలను అందుకునేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ పార్టీ పునాదులు బలంగా వున్న లెఫ్ట్ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తున్నాయి.

కాగా కేరళలో కూడా సర్వే అంచనాలు ముమ్మాటికీ అంచనాలు వాస్తవాలయ్యాయి. కేరళ ప్రజలు గత కొన్ని పర్యాయాలుగా కొనసాగిస్తున్న సంప్రాదాయాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నారు. అయితే తమిళనాడులో మాత్రం ఓటర్లు ట్రెండు మార్చారు. అయితే ఎన్నికల సమయంలో అమ్మ అక్రమ అస్తుల కేసులో అరెస్టు.. విడుదల సందర్భంగా వచ్చిన సానుభూతిని అమ్మ అందిపుచ్చుకుంది. ఇక దీనికి తోడు డిఎండీకే ఎన్నికల బరిలో నిలవడం కూడా అమ్మకు కలసివచ్చిందని అయితే ఇక్కడ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటుకుని జయలలిత ఇక్కడ వరుసగా రెండో పర్యాయం అధికార పగ్గాలను అందుకోనుంది.

పుదుచ్చెరిలో రంగస్వామి కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ డీఎంకే పార్టీల కూలమి ముందంజలో వుంది. ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచానాలను ప్రకారమే పార్టీల బలాబలాలు వున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలను అందుకునే దిశగా వుంది. అన్ని పోలింగ్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 10 గంటలకల్లా ఫలితాల ట్రెండ్స్ తెలియగా, మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : five state elections  exit polls  assam  tamil nadu  west bengal  kerala  

Other Articles