IPL 2016: Sunrisers Hyderabad beat Kings XI Punjab by 7 wickets

Warner yuvraj power hyderabad to victory

indian premier league,ipl,ipl 2016,ipl 9, sunrisers hyderabad, Kings XI Punjab, Sunrisers Hyderabad, david warnet, Yuvraj singh, Virat Kohli, cricket news, cricket

Sunrisers Hyderabad, the table toppers, need a win and they are all but through to the playoffs with two more matches to go.

పంజాబ్ పై గెలుపుతో ‘ప్లే ఆఫ్’కు చేరిన సన్ రైజర్స్

Posted: 05/15/2016 07:59 PM IST
Warner yuvraj power hyderabad to victory

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో వరుస ఒటముల తరువాత పడి లేచిన కెరటంలా.. దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాలు మించి రాణించి.. ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. మరో రెండు మ్యాచులు అడేందుకు మిగిలివుండగానే ఈ సీజన్ లో తొలిసారిగా బర్త్ ఖాయం చేసుకుంది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంది.  ఈ తాజా విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు చేరింది.

కింగ్స్ పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. సన్ రైజర్స్  ఓపెనర్లు డేవిడ్ వార్నర్(52;41 బంతుల్లో  5 ఫోర్లు,1 సిక్స్), శిఖర్ ధవన్ (25;22 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం దీపక్ హూడా(34; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ 16.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆపై యువరాజ్ సింగ్(42 నాటౌట్;24 బంతుల్లో  3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాటు, కట్టింగ్(21నాటౌట్; 11 బంతుల్లో  1 ఫోర్, 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు,

దీంతో సన్ రైజర్స్ ఇంకా రెండు బంతులుండగానే విజయం సాధించింది.  అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ మురళీ విజయ్(6) నిరాశపరచగా, హషీమ్ ఆమ్లా(96;56 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం సాహా(27), గుర్ కీరత్ సింగ్(27), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. హషీమ్ అమ్లా చేసిన భారీ స్కోరు కూడా పంజాబ్ ను అదుకోలేకపోయింది. దీంతో ప్లేఆప్ లోకి ఎంటరవ్వని జట్టుగా పంజాబ్ నిలిచింది

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  Kings XI Punjab  Sunrisers Hyderabad  david warnet  Yuvraj singh  

Other Articles