Tollywood comedian Venu Madhav to meet Governor soon

Venumadhav to meet governor

Venumadhav, tollywood comedian, news portals, Electronic media, Print media, Complains, Death News, governor ESL Narasimhan, death rumours,

Comedian Venumadhav to met Governor ESL Narasimhan soon and requested him to take stringent action on the people who are spreading news about his death.

‘ఆ తప్పుడు ప్రచారంపై త్వరలో గవర్నర్ ను కలుస్తా’

Posted: 05/15/2016 07:16 PM IST
Venumadhav to meet governor

తన నటనతో అబాలగోపాలాన్ని అలరించిన తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన హస్యనటుడు వేణుమాధవ్ త్వరలో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ను కలుస్తానని చెప్పారు. తాను పూర్తి ఆయురారోగ్యాలతో వున్నప్పటికీ.. తాను చనిపోయానన్న తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడుతున్న ఆయన ఇదే విషయమై గవర్నర్ నరసింహన్ ను కలుస్తానని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డీలను కలసిన ఆయన త్వరలోనే గవర్నర్ ను కూడా కలుస్తానన్నారు.

తన బతికివున్నా.. మరణించానంటూ వార్తలు రాసిన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వేణుమాదవ్ అభిమానుల సందేహాలపై స్పందించారు. 'నేను చనిపోయానంటూ వచ్చిన పుకార్లు కొందరు బుద్ధిలేని గాడిదలు పనిలేక చేసిన ఆరోపణలు' అని అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles